Vaishnav Tej: మాస్‌ లుక్‌లో వైష్ణవ్‌ తేజ్‌.. అదిరిపోయిన ఆదికేశవ లుక్‌..

మెగా కాపౌండ్‌ నుంచి వచ్చి ఫస్ట్‌ సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ అందుకున్న హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌. ఫస్ట్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయినప్పటికీ మిగిలిన రెండు సినిమాలు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నాలుగో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు వైష్ణవ్‌.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 05:53 PM IST

శ్రీలీల హీరోయిన్‌గా శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను కన్‌ఫాం చేస్తూ ఇవాళ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీం. వైష్ణవ్‌ నాలుగో సినిమాకు ఆదికేశవ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసింది. 47 సెకన్ల డ్యురేషన్‌తో ఫస్ట్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసింది. సితారా ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్‌, టెక్నీషియన్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్‌. సీనియర్‌ యాక్టర్స్‌ను తీసుకున్నారు.

మరో బ్యూటీ అపర్ణా దాస్ ‘వజ్ర కాళేశ్వరి దేవి’ అనే ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించబోతోంది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ రికార్డ్‌ ఉన్న జీవీ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తున్నాడు. రుద్ర కాళేశ్వర రెడ్డి అనే పవర్‌ఫుల్‌ రోల్‌లో వైష్ణవ్‌ నటించబోతున్నాడు. తన గ్రామంలో మైనింగ్‌ మాఫియా నుంచి శివాలయాన్ని కాపాడుకునే హీరో రోల్‌లో కనిపించబోతున్నాడు. మొదటి మూడు సినిమాల్లో లవర్‌ బాయ్‌లో కనిపించిన వైష్ణవ్‌.. ఈ సినిమాలో మాత్రం చాలా మాస్‌ లుక్‌లో కనిపించాడు. బాడీ పెంచి బీస్ట్‌ మోడ్‌లోకి మారిపోయాడు.

గ్లింప్స్‌ను బట్టి చూస్తే సినిమాలో ఫైట్‌ సీన్స్‌ గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మాస్‌ లుక్‌ వైష్ణవ్‌కు సూపర్‌గా సెట్‌ అయ్యిందంటున్నారు ఫ్యాన్స్‌. జీవీ నారాయణన్‌ అద్భుతమైన బీజీఎం అందించాడు. రిలీజ్‌ చేసింది 47 సెకన్ల వీడియోనే అయినా.. సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది. నాగ వంశీ ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమాను ఈ జులైలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నటు మూవీ మేకర్స్‌ ప్రకటించారు