Hyper Aadi: హైపర్‌ ఆదితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన వర్షిణి

హైపర్‌ ఆది, యాంకర్ వర్షిణి మధ్య ప్రేమ పారుతుందని, పెళ్లి పీటలు ఎక్కడమే బ్యాలెన్స్ అని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. యాంకర్‌ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 08:01 PM IST

Hyper Aadi: ఎన్ని చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా.. కొన్ని రూమర్లు ఆగవు. పలకరించిన ప్రతీసారి ఆ విషయం చర్చకు వస్తూనే ఉంటుంది. అలాంటి విషయాల్లో.. కాదు కాదు రూమర్లలో ఒకటి.. హైపర్‌ ఆది, యాంకర్ వర్షిణి పెళ్లి. ఇద్దరి మధ్య ప్రేమ పారుతుందని, పెళ్లి పీటలు ఎక్కడమే బ్యాలెన్స్ అని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. యాంకర్‌ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేసినా రాని గుర్తింపు.. టీవీ షోలతో సంపాదించింది వర్షిణి.

ఢీ డ్యాన్స్ షోతో పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తూ పేరు తెచ్చుకుంది. ఐతే ఈమె ప్రేమ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు అలానే ప్రశ్న ఎదురవగా దానిపై క్లారిటీ ఇచ్చేసింది. గతంలో కమెడియన్ హైపర్ ఆదితో కలిసి వర్షిణి.. డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసింది. అలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో నిజంగానే రిలేషన్‌లో ఉన్నారని అంతా అనుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది. అయినా సరే ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడలేదు. మొన్నీ మధ్య మరోసారి వర్షిణిని హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. దీంతో ఇన్‌స్టా వేదికగా స్పందించిన వర్షిణి.. ఎమోజీలు పోస్ట్ చేసి అలాంటిదేం లేదని చెప్పకనే చెప్పేసింది.

ఇదే చాట్ డిస్కషన్‌లో భాగంగా ఓ నెటిజన్.. పెళ్లి చేసుకుందామని వర్షిణితో అన్నాడు. దీనిపై ఫన్నీగా స్పందించిన వర్షిణి.. తన అమ్మతో మాట్లాడమని చెప్పింది. ఇదంతా పక్కనబెడితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వర్షిణి పెళ్లి ఎక్కువగా డిస్కషన్‌లోకి వస్తుంది. ఐపీఎల్ టైంలో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌తో వర్షిణి షికార్లు చేసిందని మాట్లాడుకున్నారు. దీంతో ఏదోలాగా వర్షిణి చర్చలోనే మిగిలిపోతోంది.