ఇక్కడ రింగ్ తొడగటం లాంటివేం ఉండవు. కాని తెలంగాణ స్టైల్లో పూలు పండ్ల కార్యక్రమం అయిపోయాక, సాయంత్ర మాత్రం రింగ్స్ ఎక్స్ ఛేంజ్ చేసుకున్నారట. ఇక పెళ్లి ఆంధ్రా స్టైల్లో ఐదురోజులు పెళ్లిగా జరపాలనుకుంటున్నారు. ఉదయ్ పూర్ లోని సిటీ ప్యాలెస్ లో వరున్, లావణ్య పెళ్లి ఖరారైందట. 500 మంది అతిథుల మధ్య ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు.
మొన్నటి వరకు వరుణ్,లావణ్య ఎంగేజ్ మెంట్ మీద ఎన్ని పుకార్లొచ్చినా మెగా హీరోలు ఖండించలేదు. నాగబాబు ఫ్యామిలీ రియాక్ట్ కాలేదు. సైలెంట్ గా నిశ్చితార్ధం తంతు కానిచ్చేశారు. ఇక ఆ మూడు ముళ్లు పడే కార్యక్రమం మాత్రం నార్త్ ఇండియాలో ప్లాన్చేశారు. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో మొదటి వారాలు బాగున్నాయని, జాతకాల ప్రకారం ఆనెల్లో వెడ్డింగ్ బెల్స్ మోగిస్తే బాగుంటుందని నిర్ధారణకు వచ్చాయట రెండు కుటుంబాలు..