Varun Tej: త్వరలో వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి? ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ ?

రీసెంట్‌గా వచ్చిన గాసిప్‌ ఏంటంటే.. త్వరలోనే లావణ్య, వరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నారట. జూన్‌లో వీళ్ల ఎంగేజ్‌మెంట్‌కూడా జరగబోతోదంటూ సమాచారం. వీళ్ల లవ్‌కు ఇద్దరి ఫ్యామిలీస్‌లో ఓకే చెప్పేశారట. ఈ విషయాన్ని త్వరలోనే మెగా కుటుంబం ఎనౌన్స్‌ చేయబోతోందని టాక్‌.

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 06:49 PM IST

Varun Tej: హ్యాండ్‌సమ్‌ హంక్‌ వరుణ్‌ తేజ్‌, సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి రిలేషన్‌ గురించి చాలా కాలంగా గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. వీళ్లు చాలా కాలం నుంచి లవ్‌లో ఉన్నారంటూ.. పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. గతంలో నిహారిక పెళ్లిలో కూడా లావణ్య త్రిపాఠి సందడి చేసింది. ఆ మధ్య వరుణ్‌ తన బర్త్‌డే నాడు హైదరాబాద్‌లో ఉండకుండా బెంగళూరు వెళ్లాడు.

లావణ్య కోసమే వరుణ్ బెంగళూరు వెళ్లాడంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కానీ లావణ్య ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. తాను తన ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీంతో వరుణ్‌ వెళ్లింది లావణ్య కోసం కాదు అని క్లారిటీ వచ్చింది. కానీ వీళ్ల గురించి వస్తున్న గాసిప్స్‌ మాత్రం ఆగలేదు. చాలా పార్టీస్‌లో, ఫంక్షన్స్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు. వరుణ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా లావణ్యను తమ ఇంట్లో మెంబర్‌లా ట్రీట్‌ చేశారు. దీంతో వీళ్ల లవ్‌ ఇష్యూ మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన గాసిప్‌ ఏంటంటే.. త్వరలోనే లావణ్య, వరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నారట. జూన్‌లో వీళ్ల ఎంగేజ్‌మెంట్‌కూడా జరగబోతోదంటూ సమాచారం. వీళ్ల లవ్‌కు ఇద్దరి ఫ్యామిలీస్‌లో ఓకే చెప్పేశారట.

ఈ విషయాన్ని త్వరలోనే మెగా కుటుంబం ఎనౌన్స్‌ చేయబోతోందని టాక్‌. అలాగే ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది జనవరిలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్. అయితే వరుణ్‌తో లవ్‌ గురించి వస్తున్న వార్తలను లావణ్య చాలాసార్లు కొట్టిపారేసింది. వరుణ్‌ కూడా తమ మధ్య అలాంటి రిలేషన్‌ లేదని.. తాము మంచి ఫ్రెండ్స్‌ అంటూ చెప్పాడు. వీళ్లిద్దరూ క్లారిటీగా చెప్పినా రూమర్స్‌ మాత్రం చాలా దగ్గరి సోర్స్‌ నుంచి వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా అంతా ఈ ప్రచారాన్ని నమ్మేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న రూమర్స్‌ గురించి వరుణ్‌, లావణ్య ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.