Varun Tej: మిస్టర్ సినిమాతో ప్రేమలో పడి త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్‌గా మారబోతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. చాలా సస్పెన్స్ తరువాత తమ లవ్‌ను రివీల్ చేసిన ఈ పెయిర్.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్న సమయంలోనే వీళ్ల లవ్ స్టార్ట్ అయ్యిందట.
దీంతో ఎక్కడ లవ్ స్టార్ట్ అయ్యిందో అక్కడే వెడ్డింగ్ లైఫ్‌ను కూడా స్టార్ట్ చేయాలని ఇద్దరూ డిసైడ్ ఐనట్టు తెలుస్తోంది. పెళ్లి కోసం మంచి రిసార్ట్ కూడా వెతుకుతున్నారట. అయితే అన్నీ చెప్పినా పెళ్లి డేట్ మాత్రం ఇప్పటి వరకూ చెప్పలేదు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో పెళ్లి డేట్ పెండింగ్‌లో పెట్టారు. ప్రజెంట్ ప్రవీణ్ సత్తారుతో గాంఢీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా దాదాపు పూర్తైంది. ఆగస్ట్ 25న సినిమా రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత శక్తి ప్రతాప్ సింగ్ అనే డైరెక్టర్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారట. అటు లావణ్య త్రిపాఠి కూడా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగానే ఉంది.
తమిళ్‌లో హీరో అధర్వతో ఓ సినిమా చేస్తోంది. దాని తరువాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా సైన్ చేసింది. ఆ సినిమా తరువాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతోంది. వీళ్లిద్దరు ఇప్పుడు చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటామని డిసైడ్ అయ్యారట. దీంతో వీళ్ల పెళ్లి ఇంకా లేట్ అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు. నిజానికి 2023 ఎండింగ్‌లోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అని అంతా అనుకున్నారు. కానీ ప్రజెంట్ సైన్ చేసిన ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేసిన తరువాతే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారట ఈ లవ్ కపుల్.