Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడయ్యాడు. నవంబర్ 1న వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఇటలీలో జరిగిన ఈ పెళ్లికి.. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు.. అతి కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు చాలా ఘనంగా జరిగాయ్. వీరి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రాంచరణ్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులతో పాటు.. హీరో నితిన్ కూడా ఫ్యామిలీతో అటెండ్ అయ్యాడు.
Bigg Boss 7 : రాజమాత రచ్చ.. అశ్విని పై విరుచుకుపడ్డ ప్రియాంక, శోభా, కాళ్లు మొక్కిన అశ్విని..!
పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చిన కొత్త జంట.. గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఇచ్చింది. ఐతే వరుణ్ పెళ్లికి సంబంధించి మెగా ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్, లావణ్య పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను ఓటీటీలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో పెళ్లి వీడియో టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన వీడియోను అభిమానులు అందరూ చూసేలా ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వీరి పెళ్లి వీడియో ప్రసార హక్కులను దాదాపు రూ.8 కోట్లకు.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు ఫిలిం సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Janhvi Kapoor: ఎన్టీఆర్ కొంప ముంచేస్తున్న బాలీవుడ్ హీరోయిన్..!
ఇలా పెళ్లి వీడియోను ఓటీటీకి ఇవ్వడం కొత్తేం కాదు. గతంలో కోలీవుడ్ కపుల్స్ నయనతార – విగ్నేష్ శివన్, హన్సిక – సోహెల్ వంటి సెలబ్రిటీస్ తమ మ్యారేజ్ వేడుకలను ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్లి వేడుక కూడా ఓటీటీలో ప్రసారం కాబోతుందనే వార్త తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక అటు రీసెంట్‌గా గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.