రీసెంట్గా ఓ ఫంక్షన్లో లావణ్య మెడలో పసుపు తాడు కనిపించడంతో వరుణ్ లావణ్య పెళ్లి కూడా చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అంత సింపుల్‌గా, సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకుంటాడంటూ ఫ్యాన్స్ కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు మరో వార్త సినీ వర్గాలను చుట్టేస్తుంది. జూన్ 9న లావణ్య వరుణ్ ఎంగెజ్మెంట్ జరగబోతోందట.
ఇద్దరి ఇళ్లలో వీళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట పేరెంట్స్. దీంతో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారని అంటున్నారు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుల నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినా.. మెగా కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా లేదు. కానీ డేట్‌తో సహా పక్కాగా చెప్పడంతో ఇది నిజమేమో అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే వరుణ్ లావణ్య విషయంలో రూమర్స్ కొత్తేమీ కాదు. వీళ్లిద్దరు కలిసి కనిపిస్తేనే కాదు.. కనిపించకపోయినా రూమర్సే.
లాస్ట్ ఇయర్ వరుణ్ తన బర్త్‌డేకు హైదరాబాద్‌లో ఉండకుండా బెంగళూరుకు వెళ్లిపోయాడు. లావణ్య కోసమే వరుణ్ బెంగళూరుకు వెళ్లాడంటూ అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి. దీంతో లావణ్య ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. కొన్ని రోజులు ఈ గాసిప్స్ ఆగిపోయినా.. రీసెంట్గా వరుణ్ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్లో లావణ్య కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పుడైతే ఏకంగా ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయ్యిందంటున్నారు. అయితే ఇది కూడా రూమరేనా.. లేక నిజంగానే వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారా అనే విషయంలో మెగా ఫ్యామిలీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.