చిరు, చెర్రీ, పవన్ కళ్యాణ్, బన్నీ, ఆఖరికి సాయితేజ్ కి కూడా మాస్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. అందరి లైఫ్ బాగుంది. మెగా హీరోల్లో మాత్రం ఇంకా హిట్ కోసం, గుర్తింపు కోసం లాటరీలు కొడుతోంది వరుణ్ తేజే. తొలిప్రేమ, ఫిదా లాంటి క్లాస్ హిట్లొచ్చాయి. ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి కామెడీ హిట్లు పడ్డాయి. గద్దలకొండ గణేష్ లాంటి మాస్ హిట్లు కూడా వచ్చాయి. కానీ ఏం లాభం హీరోగా తనకు రావాల్సిన గుర్తింపు మార్కెట్ క్రియేట్ కాలేదు. దీనికి కారణం వరుణ్ తేజ్ కి రావాల్సిన క్రెడిట్ రాకపోవటం.
తొలిప్రేమ, ఫిదా హిట్టైనా ఫోకస్ అంతా హీరోయిన్ల మీద పడింది. ఎఫ్ 2, ఎఫ్ 3 హిట్ల క్రెడిట్ డైరెక్టర్ తోపాటు వెంకీ అండ్ కోకి వెళ్లింది. ఇక గద్దలకొండ గణేష్ హిట్టైనా, ఫోకస్ అంతా పూజా హెగ్డే మీదకి షిఫ్ట్ అవటంతో పాటు, హరీష్ శంకర్ కే క్రెడిట్ దక్కింది.అందుకే తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్, మార్కెట్ దక్కక సాలిడ్ హిట్ కోసం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు వరుణ్ తేజ్.