ఎంగేజ్‌మెంట్ కూడా చాలా సింపుల్‌గా జరిగింది. హైదరాబాద్ మణికొండలోని ఈవెంట్ జరిగింది. మెగా ఫ్యామిలీ అనుకుంటే 7 స్టార్ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిపించొచ్చు. మరీ ఇంత సింపుల్‌గా నిశ్చితార్థం జరగడం.. అదీ రెండు కుటుంబాల మధ్యే ఫంక్షన్ జరగడం.. అభిమానుల్లో కొత్త అనుమానాలకు తావిస్తోంది. నిశ్చితార్థం ఇంత సైలెంట్‌గా చేయడానికి కారణం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పెళ్లి అయినా గ్రాండ్‌గా జరిపిస్తారా.. లేదంటే ఇలానే మమ అనిపించేస్తారా అనే అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయ్.
కూతురు ఎంగేజ్‌మెంట్, పెళ్లి అంత గ్రాండ్‌గా చేసిన నాగబాబు.. వరుణ్ విషయంలో ఇంత సింప్లిసిటీ ఎందుకు అనే డౌట్లు వస్తున్నాయ్. లావణ్యతో వరుణ్ పెళ్లి చిరంజీవికి ఇష్టం లేదా అందుకే ఇంత సింపుల్‌గా చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్. ఐతే వరుణ్, లావణ్య ప్రేమ కథకు సంబంధించి.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయ్. ప్రేమ పేరుతో నానా పెంట చేస్తున్న ఎందరో ప్రేమికులు.. వరుణ్, లావణ్య జంట నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఐదేళ్ల కింద అంతరిక్షం సినిమా సమయంలో వరుణ్, లావణ్య మధ్యపరిచయం అయింది. అది కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నా.. ఎక్కడా హద్దులు దాటలేదు ఈ ఇద్దరు. ఎవరికి వారే కెరీర్‌లో కంటిన్యూ అవుతూ.. ప్రేమకథను కొనసాగించారు. అంతే తప్ప.. బయట ఇద్దరు కలిసి ఎక్కడా కనిపించలేదు.
ప్రేమ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి.. చాలా హుందాగా ప్రవర్తించారే తప్ప.. ఒక్క మాట జారలేదు. ఒక్క మాట తప్పుగా అనలేదు. ఈ ఇద్దరు.. రిలేషన్‌లో చాలా మెచ్యూర్డ్‌గా కనిపించారు. వరుణ్, లావణ్య కలిసి మూడు సినిమాలు చేశారు. అదే వీళ్ల ప్రేమను మరింత బలంగా చేసింది. నిజానికి లావణ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని చిరంజీవికే చెప్పాడు వరుణ్‌తేజ్. ఈ ఇద్దరి పెళ్లికి నాగబాబు మొదట్లో అంగీకరించలేదు. ఐతే చిరంజీవే నాగబాబు నచ్చజెప్పి ఒప్పించాడు. ప్రేమలో ఉన్నా.. వరుణ్, లావణ్య ఎప్పుడూ బయట తిరుగుళ్లు చేయలేదు. పబ్బులు, క్లబ్బులు అంటూ హడావుడి చేయలేదు. లావణ్య మీద, వరుణ్ మీద ఏ చిన్న గాసిప్ కూడా రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు.. ఇద్దరు ప్రేమలో ఎంత మెచ్యూర్డ్‌గా వ్యవహరించారో అని !