Tollywood: నితిన్‌ను వెంకటేష్‌ గట్టెక్కిస్తాడా ? రిస్క్‌లో యంగ్‌ హీరో లైఫ్‌

వెంకటేష్‌ కుడుములు పెన్ను పట్టుకుంటే ఓం కంటే ముందు రష్మిక పేరు రాస్తాడు. ఇది మేం చెప్తున్న మాట కాదు. హీరో నితిన్‌ చెప్తున్న మాట.

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 05:00 PM IST

వెంకటేష్‌ కుడుముల, నితిన్‌, రష్మిక మందన కాంబినేషన్‌లో రానున్న మరో ప్రాజెక్ట్‌ను.. చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేశారు మైత్రీ మూవీ మేకర్స్‌. జనరల్‌గా మూవీ అనౌన్స్‌మెంట్‌ అంటే పోస్టర్‌ లేదా గ్లింప్స్‌ రిలీజ్‌ చేస్తారు. కానీ ఈ సినిమాకు మాత్రం చిన్న డ్రామాతో మూవీ అనౌన్స్‌ చేశారు. చిన్నపాటి షార్ట్‌ ఫిలిం తీశారు. హీరో, హీరోయిన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, సినిమా డైరెక్టర్‌ మధ్య ఓ టాపిక్‌ క్రియేట్‌ చేసి సినిమా గురించి డిటెయిల్స్‌ ఇచ్చారు. ఈ వీడియోతో ఎవరి మనోభావాలను మేము దెబ్బతీయడంలేదు.. మా మనోభావాలను మేమే దెబ్బతీసుకుంటున్నాం అంటూ డిఫరెంట్‌గా ట్రై చేశారు.

నేను ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోందని రష్మిక అంటే.. నేను ఒక్క హిట్‌ కొడితే మూడు ఫ్లాపులు ఇస్తున్నా అని నితిన్‌ అంటూ వాళ్ల మీద వాళ్లే పంచులు వేసుకున్నారు. ఈ ముగ్గురి కాంబోలో మరో సినిమా రాబోతోందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ ఎక్కడా ఎలాంటి అఫియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదు. దీంతో సినిమా ఇక లేనట్టే అనుకున్నారంతా. కానీ మూవీని డిఫరెంట్‌గా లాంచ్‌ చేసి అందరికీ షాకిచ్చారు మూవీ యూనిట్‌. ఈ సినిమాకు జీవీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా వచ్చి క్లాప్‌ కొట్టారు. భీష్మ సినిమాతో మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ ట్రియో.. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొడతారా లేదా చూడాలి.