Venkatesh and Rana: వెబ్ సిరీస్ కోసం ఒక్కటైన బాబాయ్ అబ్బాయ్

ఇటీవలికాలంలో వెబ్ సరీస్‌లపై తారలు మనసు పారేసుకుంటున్నారు. స్టార్లు చాలా మంది వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బాబాయ్ వెంకటేశ్, అబ్బాయ్ రానా కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించారు.

  • Written By:
  • Publish Date - February 16, 2023 / 04:26 PM IST

మల్టీస్టారర్ మూవీలకి పెట్టింది పేరు వెంకటేష్ . గతేడాది వరుణ్ తేజ్‌తో చేసిన ‘ఎఫ్ 3’ మూవీతో మరో సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత విశ్వక్‌ సేన్‌తో ‘ఓరి దేవుడా’ మూవీలో దేవుడి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈయన రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కంప్లీట్ చేశారు. ‘రానా నాయుడు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు.గతంలో వీళ్లిద్దరు ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఓ పాటలో కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు.

ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరబోతుంది. నిజ జీవితంలో బాబాయి, అబ్బాయిలైన వెంకటేష్, రానాలు ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు. రానా ఇది వరకు కనిపించని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ఇక నాగ పాత్రలో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ ‌లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసారు. తండ్రి అంటే పడని కొడుకు పాత్రలో రానా నటించారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఉప్పు, నిప్పు తరహాలో వీళ్లిద్దరు పాత్రలున్నాయి. ఈ వెబ్ సిరీస్ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వెంకటేష్, రానాలకు ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్‌కు భారతీయ అడాప్షన్.

రానా దగ్గుబాటి తన బాబాయ్, నెట్‌ఫ్లిక్స్‌తో మొదటిసారి కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ చాలా కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఇది నెట్‌ఫ్లిక్స్‌తో బాబాయ్ వెంకీతో నా మొదటి కొలాబరేషన్ . రానా నాయుడు దానిని అందించినందుకు సంతోషిస్తున్నాను. మొత్తం తారాగణం, టీం ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. అతను తన కుటుంబంతో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న సంక్లిష్టమైన పాత్ర, అదే సమయంలో తన తండ్రితో అతని సంబంధంతో కూడా పోరాడే పాత్ర. రానా, నాగ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రపంచాన్ని అందరూ ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ .. ‘రానా నాయుడు’ లాంటి ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ చేంజ్. ఈ పాత్ర తెలివైన, ఆకర్షణీయమైన లేయర్లుగా వుంటుంది. నా అభిమానులు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా విధాలుగా కొత్తది. ఈ సిరీస్‌లో ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతల బృందంతో కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమైన అనుభవం.