సీనియర్ హీరోల్లో ముందుగా వెబ్ సిరీస్ చేసిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతా బాగానే వున్నా.. రానా నాయుడు స్ట్రీమింగ్ తర్వాత 35 ఏళ్లపాటు కట్టుకున్న ఫ్యామిలీ ఇమేజ్ ను కూల్చేసుకున్నాడు. ఎప్పుడూ లేనంతా విమర్శలు కొని తెచ్చుకున్నాడు. అడల్ట్ కంటెంట్ వున్న వెబ్ సిరీస్‌లో ఇంకెవరైనా నటించినా.. పెద్దగా పట్టించుకోరు. ఫ్యామిలీ హీరో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం ఏంటి ఫ్యామిలీతో చూడొద్దని రానా, వెంకటేశ్ ముందే చెప్పినా.. ఇలాంటి సినిమాల్లో నటించాల్సి అంత అవసరం దగ్గుబాటి ఫ్యామిలీకి ఎందుకొచ్చింది? 18 ప్లస్ కూడా చూడలేని విధంగా వెబ్‌సిరీస్ వుంది.
రెండు వారాలుగా ఎన్ని విమర్శలు వచ్చినా.. వెంకటేశ్ స్పందించలేదు. వెంకటేశ్, రానా నాయుడు పేరెత్తకుండానే విజయశాంతి నిప్పులు చెరిగింది. అసభ్యకర దృశ్యాలను తొలగించి ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సూచించింది. ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ ఇద్దరు కలిసి శత్రువు.. సూర్య ఐపియస్.. చినరాయుడు సినిమాల్లో నటించారు. విజయశాంతితో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వచ్చినా.. ఎన్ని విమర్శలు వచ్చినా.. వెంకటేశ్ పట్టించుకోవడం లేదు. వీటన్నింటికి సమాధానం ఇచ్చి ఇష్యూను మరింత కంపు చేయడం ఎందుకన్న ఫీలింగ్‌తో వున్నాడని తెలిసింది. సమయం వచ్చినప్పుడు మాట్లాడదామంటున్నాడట. రానా నాయుడు సీజన్ 2లో నటిస్తే.. ఈ విమర్శలు ఏవీ పట్టించుకోవడం లేదని.. ఫ్యామిలీ ఇమేజ్ను కూడా పక్కన పెట్టేశాడని అర్థం. ఒకవేళ నటించకపోతే.. సీజన్ ఒన్‌లో నటించి తప్పుచేశానని ఫీలైనట్టు లెక్క.