మేనల్లుడుకి వెంకి మామ కాస్ట్లీ గిఫ్ట్, రానా గిఫ్ట్ కు మైండ్ బ్లాక్

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య వివాహం చేసుకొని ఫుల్ ఖుషి గా ఉన్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని ఎవరు ఏమనుకున్నా సరే పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా నిర్వహించింది అక్కినేని ఫ్యామిలీ...

  • Written By:
  • Publish Date - December 7, 2024 / 04:05 PM IST

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య వివాహం చేసుకొని ఫుల్ ఖుషి గా ఉన్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని ఎవరు ఏమనుకున్నా సరే పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా నిర్వహించింది అక్కినేని ఫ్యామిలీ… చాలా తక్కువ మంది అతిధులతో కేవలం నాగార్జునకు చాలా సన్నిహితంగా ఉండే వారితోనే వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ రాజకీయ ప్రముఖులు వస్తారు అనుకున్నా కేవలం సినిమా ప్రముఖులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

అది కొద్ది మంది వ్యాపార ప్రముఖులు వివాహానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు విడుదల చేశారు. ఇదిలా ఉంచితే చైతు వివాహం కోసం దగ్గుబాటి ఫ్యామిలీ చాలా హడావిడి చేసింది. రానా, వెంకటేష్ అలాగే సురేష్ బాబు సహా ఈ వివాహానికి దాదాపుగా అందరూ హాజరయ్యారు. అలాగే మేనల్లుడికి వెంకటేష్ భారీ కానుకలు ఇచ్చినట్లుగా టాక్. నాగచైతన్య వెంకటేష్ చాలా క్లోజ్ గా ఉంటారు. గతంలో వీళ్ళిద్దరూ కలిసి రెండు సినిమాల్లో కూడా నటించారు.

వెంకటేష్ చైతు అంటే చాలా ఇష్టం అని కూడా చెబుతూ ఉంటారు. అటు రానా కూడా చైతన్యతో చాలా క్లోజ్ గా ఉంటాడు. దీనితో వీరిద్దరూ కలిసి చైతుకు చాలా ఖరీదైన కానుకలు ఇచ్చారని టాక్. మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఇవ్వలేకపోయారని… కొన్ని కారణాల వల్ల అప్పుడు వాయిదా పడిందని కానీ ఈ వివాహానికి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలనుకుని ఇచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. చైతన్యకు స్పోర్ట్స్ కార్లన్న స్పోర్ట్స్ బైక్స్ అన్న చాలా ఇష్టం అందుకే రానా చైతన్య కోసం బిఎండబ్ల్యూ స్పోర్ట్స్ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట.

అలాగే ఒక జాగ్వర్ కంపెనీ కారు వెంకటేష్ కానుకగా ఇచ్చినట్లు టాక్. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారట. విదేశాల నుంచి కారుని ఇంపోర్ట్ చేసుకున్నట్టు అక్కినేని ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. చైతన్య పెళ్లి వేడుకల్లో వెంకటేష్ కూడా చాలా హుషారుగా పాల్గొని జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అటు శోభిత కుటుంబం కూడా నాగచైతన్య కోసం భారీ కానుకలే ఇచ్చింది. ఇక వీరిద్దరూ వివాహం తర్వాత విదేశాలకు హనీమూన్ ట్రిప్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. దాదాపు 3 నెలల పాటు యూరప్ లో ఉంటారు ఈ జంట.