VENU SWAMY: అషురెడ్డి పూజలు.. వేణుస్వామి చెంతకు మరో బ్యూటీ ! నీ నమ్మకమే నిన్ను కాపాడాలి..

2023లో బీఆర్ఎస్‌ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ గెలిచింది. ప్రభాస్ కెరీర్ అయిపోయింది అన్నారు. కట్‌ చేస్తే సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేసింది. దీంతో వేణు స్వామిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అంతా!

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 06:03 PM IST

VENU SWAMY: సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వేణుస్వామి దగ్గర.. సెలబ్రిటీలు పోటీ పడి మరీ పూజలు చేయిస్తుంటారు. ఈ సెలబ్రిటీల జీవితంలో జరగబోయేది ఇదే.. వీళ్లు విడిపోతారు.. వాళ్లు గెలుస్తారు.. అంటూ సోషల్‌ మీడియాలో అటెన్షన్‌ కోసం అంటారో.. నిజంగా తెలిసి అంటారో కానీ.. ఎప్పుడూ డిస్కషన్‌గానే మిగులుతారు వేణుస్వామి. సమంత, నాగచైతన్య విడిపోతారంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్‌ మాములు వైరల్ కాలేదు. ఐతే అది నిజంగానే జరిగింది.

YS SHARMILA: జగన్ నా రక్తమే.. కానీ, కల్తీ మద్యంతో జనాల్ని చంపుతున్నారు: షర్మిల

ఆ ఒక్కటి జరిగింది కదా అని.. వేణుస్వామి చెప్పినవి అన్నీ జరుగుతున్నాయా అంటే అదీ లేదు. 2023లో బీఆర్ఎస్‌ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ గెలిచింది. ప్రభాస్ కెరీర్ అయిపోయింది అన్నారు. కట్‌ చేస్తే సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేసింది. దీంతో వేణు స్వామిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అంతా! ఇదంతా ఎలా ఉన్నా.. వేణుస్వామి చెంతకు ఇప్పుడు మరో బ్యూటీ చేసింది. బిగ్‌బాస్‌ షో ద్వారా పాపులర్ అయిన నటి అషురెడ్డి.. వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించారు. అషురెడ్డి సోషల్ మీడియా ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండుసార్లు బిగ్‌బాస్‌కు వెళ్లి సక్సెస్ అయింది. టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గానూ వర్క్‌ చేస్తోంది. ఐతే ఇప్పుడు వేణుస్వామితో.. తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేయించిన ఫోటోలు వీడియోలను అషురెడ్డి షేర్ చేసింది. వేణుస్వామి ఆశీర్వాదం తీసుకుంటూ ఆయన పాదాలకు నమస్కరించింది అషురెడ్డి.

ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయ్. ఐతే అషురెడ్డి కెరీర్‌కు ఇప్పుడు బ్రేక్‌లు పడినట్లు కనిపిస్తున్నాయ్. మళ్లీ స్పీడ్ అందుకునేందుకే ఇలాంటి పూజలు చేయిస్తుందేమో అంటూ.. కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నీ నమ్మకమే నిన్ను కాపాడాలి అంటున్నారు. ఐతే అషురెడ్డి షేర్ చేసిన వీడియోకు కామెంట్స్ ఆఫ్‌ చేసి ఉన్నాయ్. ఐతే గతంలోనూ వేణు స్వామితో అషురెడ్డి ప్రత్యేకంగా పూజలు చేయించారు. కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు కూడా వేణు స్వామితో ప్రత్యేకంగా పూజలు చేయించారు. సక్సెస్ కోసమే ఇలా పూజలు చేస్తున్నారని కొందరు కామెంట్లు పెడ్తుంటే.. ఎవరి నమ్మకాలు వారి అంటూ మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.