Mokshagna: నందమూరి మోక్షజ్ఞ జాతకం చెప్పిన వేణు స్వామి

నందమూరి వారసుడి సినీ కెరీర్‌ ఎలా ఉండబోతోందని ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణుస్వామి జాతకం చెప్పారు. మోక్షజ్ఞ విషయంలో వేణుస్వామి ఆస్ట్రాలజీ నిజమవుతుందా చూడాలి.

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 03:57 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఈ ఇయర్‌ సీని ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాలకృష్ణ తరువాతి ప్రాజెక్ట్‌ ఆదిత్య 999 మ్యాక్స్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ నందమూరి వారసుడి సినీ కెరీర్‌ ఎలా ఉండబోతోందని ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణుస్వామి జాతకం చెప్పారు. మోక్షజ్ఞ గురించి పలు ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌గా ఎదుగుతాడట. బాలకృష్ణ కొడుకుగా కాకుండా తనకు ఓ స్టార్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకుంటాడట. తండ్రికి తగ్గ కొడుకుగా సినిమాల్లో దూసుకుపోతాడట. వేణు స్వామి తరచుగా సెలబ్రెటీలు, క్రికెటర్ల జాతకం గురించి చెప్తుంటారు. చాలా సందర్భాల్లో ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఈ ఇన్సిడెంట్స్‌ వల్లే వేణు స్వామి చాలా ఫేమస్‌ అయ్యారు. టాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రెటీలు ఆయన ఆస్ట్రాలజీని నమ్ముతారు.

అలాంటి వేణుస్వామి ఇప్పుడు మోక్షజ్ఞ గురించి చెప్పిన విషయాలు నందమూరి ఫ్యాన్స్‌లో కొత్త జోష్‌ నింపుతున్నాయి. నందమూరి కుటుంబం నుంచి రాబోతున్న నేటి తరం హీరో కూడా సూపర్‌ స్టార్‌ కానున్నారని తెలిసి ఫ్యాన్స్‌ ఫుల్‌ కుషీ అవుతున్నారు. అయితే ఆదిత్య 999 మ్యాక్స్‌ సినిమాకు బాలకృష్ణ కూతురే ప్రొడ్యూసర్‌గా ఉండబోతున్నట్టు సమాచారం. సొంత బ్యానర్‌లో సినిమా తీస్తున్నా కూడా.. ఈ సినిమా కోసం మోక్షజ్ఞకు భారీగా రెమ్యునరేషన్‌ ఇస్తున్నారంటూ టాక్‌ నడుస్తోంది. దీనికోసం ఇప్పటికే మోక్షజ్ఞ తన లుక్‌ను కూడా మార్చుకున్నాడట. అయితే అందరు సెలబ్రెటీల మాదిరిగానే మోక్షజ్ఞ విషయంలో కూడా వేణుస్వామి ఆస్ట్రాలజీ నిజమవుతుందా చూడాలి మరి.