100 ఎకరాల అడవి.. 500 కోట్ల విలన్.. 1000 కోట్లంటే లెక్కే లేదా..?

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో విలన్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ కోసం మలేసియా లేడీని ఇంపోర్ట్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కుదరకపోతే హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా జోన్స్ ని తీసుకుంటాడట.

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 03:59 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో విలన్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ కోసం మలేసియా లేడీని ఇంపోర్ట్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కుదరకపోతే హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా జోన్స్ ని తీసుకుంటాడట. మరి సూపర్ స్టార్ మహేశ్ తో పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నరాజమౌలి ఏంచేస్తున్నట్టు..? పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వైపు త్రిబుల్ ఆర్ క్రేజ్ తో ఎప్పుడో అడుగులేశాడు రాజమౌళి. ఇప్పుడు సాలిడ్ పాన్ వరల్డ్ మూవీ తీయాల్సి వస్తే, అదెలా ఉంటుంది? అందులో విలన్ ఎవరంటే, అక్కడే అందరికి షాక్ ఇస్తున్నాడు రాజమౌలి. హాలీవుడ్ సూపర్ హీరో థోర్ ఫేం ని మహేశ్ బాబు సినిమాలో తీసుకుంటున్నాడు. వందకోట్లు ఖర్చు పెట్టి వంద ఎకరాల్లో ప్లాస్టిక్ అడవినే క్రియేట్ చేయబోతున్నాడు… బాహుబలి మొదలైనప్పుడు ఎలాంటి సైలెన్స్ మేయింటేన్ చేశాడో.. ఇప్పుడు అదే సైలెన్స్ మేయింటేన్ చేస్తున్నాడు. కాబట్టే వందకోట్లు, వందఎకరాలు, హాలీవుడ్ సూపర్ స్టార్ తో మీటింగ్.. ఇవన్నీ చూస్తే బ్రహ్మాండమేదో బద్దలయ్యేలా ఉంది… అదేంటో డిటేల్డ్ గా చూసేయండి.

వందకోట్ల బడ్జెట్ ని కేవలం మహేశ్ బాబు సినిమా లో ఒక 20 నిమిషాల ఎపిసోడ్ కోసమే వాడబోతున్నాడు రాజమౌలి. అది కూడా కేవలం ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం వేసే సెట్ అని తెలుస్తోంది. వంద ఎకరాల్లో పూర్తిగా ప్లాస్టిక్ తో చిన్న పాటి ఫారెస్ట్ సెట్ ని రెడీ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఇది నిజంగా షాకింగ్…

దీనికంటే రియల్ ఫారెస్ట్ లోనే షూట్ చేయొచ్చు కదా అంటే, భారీ ఎక్స్ ప్లోజివ్స్ ని వాడబోతున్నారు కాబట్టి, ప్రపంచం లో ఏదేశ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కూడా ఇందుకు పర్మీషన్ ఇవ్వదు.. అలాంటి టైంలో హాలీవుడ్ మేకర్స్ 20 నుంచి 30 ఎకరాల వరకు ఇలా ప్లాస్టిక్ ట్రీస్ తో చిన్న పాటి అడవిని సెట్ చేయటం కామన్. అందులోనే భారీ బ్లాస్టింగ్ సీన్స్ తీయటం కూడా అంతే కామన్

అయితే వాళ్లు కూడా ఎన్నడూ చేయంది, 100 ఎకరాల్లో ప్లాస్టిక్ చెట్లతో రియలిస్టిక్ అడవిని సెట్ చేసి, రెండు నెలలు షూట్ చేయబోతున్నాడు రాజమౌలి. 1500 కోట్ల బడ్జెట్ లో వందకోట్లు కేవలం ఈ అడవి సెట్ కే వేయటం విచిత్రం అంటే, ఇందులో హాలీవుడ్ సూపర్ హీరోని స్పెషల్ రోల్ లో తీసుకుంటున్నారట.

థోర్ పాత్రతో ఫోకస్ అయిన హాలీవుడ్ హీరో క్రిస్ హోమ్ వర్త్ ఇప్పుడు మహేశ్ బాబు సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఇండోనేషియా మూలలున్న అమెరికన్ నటి చెల్సియా కితోడు ఇలా హాలీవుడ్ హీరో కూడా వస్తుండటంతో, మహేశ్ బాబు సినిమాకు ఇన్ స్టెంట్ గా వరల్డ్ అప్పియరెన్స్ వస్తోంది.

వీటన్నింటికి తగ్గట్టే సినిమాను నెక్ట్స్ లెవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో ప్లాన్ చేసిన రాజమౌళి, ఇలా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 100 ఎకరాల్లో వంద కోట్ల ఖర్చుతో అడవి సెట్ తో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు.