SAINDHAV: సంక్రాంతికి వెంకీ, నాగ్ ఇద్దరికీ హ్యాట్రిక్ ఛాన్స్..?

సంక్రాంతి పోరులో ఈ సారి నాగ్ మూవీ నా సామి రంగని సైంధవ్ సినిమానే మించేలా ఉందంటున్నారు. కేవలం ట్రైలర్ పేలిందనే కోణంలోనే కాదు.. రెండు సార్లు గతంలో ఇలానే జరిగింది కాబట్టి ఈ సెంటిమెంట్ బలపడింది.

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 06:16 PM IST

SAINDHAV: విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ ఈనెల 13న వరల్డ్ వైడ్‌గా రాబోతోంది. ఆ మరుసటి రోజు కింగ్ నాగార్జున మాస్ సినిమా నా సామిరంగ రిలీజ్ కానుంది. బావ.. బామ్మర్దులు మధ్య సినీ వార్ జరగబోతోంది. ఇద్దరి మధ్య గతం ఎలా ఉన్నా వర్తమానం చాలా హెల్తీ రిలేషన్‌షిప్ నడుస్తోంది. కానీ, సినిమాల పోటీలో ఎప్పుడూ వెంకీనే ముందుంటున్నాడు. సంక్రాంతి పోరులో ఈ సారి నాగ్ మూవీ నా సామి రంగని సైంధవ్ సినిమానే మించేలా ఉందంటున్నారు.

PRABHAS: ఆ సినిమాలతో ప్రభాస్‌ రిస్క్ చేస్తున్నాడా..? పంచ్ పడుతుందా..?

కేవలం ట్రైలర్ పేలిందనే కోణంలోనే కాదు.. రెండు సార్లు గతంలో ఇలానే జరిగింది కాబట్టి ఈ సెంటిమెంట్ బలపడింది. 1989లో ప్రేమ మూవీతో వెంకీ సంక్రాంతికి ఎటాక్ చేశాడు. అప్పుడే కింగ్ నాగార్జున మూవీ విజయ్ వచ్చింది. కాని వెంకటేష్ మూవీ ప్రేమనే హిట్టైంది. తర్వాత 1992లో కింగ్ నాగార్జున కిల్లర్‌గా వస్తే, వెంకీ మాత్రం చంటిగా వచ్చాడు. ఇక్కడ కూడా వెంకీనే రెండోసారి హిట్ మెట్టెక్కాడు. అలా రెండు సార్లు సంక్రాతికి ఈ ఇద్దరి మధ్య వార్‌లో వెంకిదే పైచేయి అయ్యింది. సో.. ఈ సంక్రాంతికి నాసామిరంగ, సైంధవ్ పోటీ పడుతున్నాయి. గతమే ఇక్కడ రిపీట్ అయితే హ్యాట్రిక్ కిక్ వెంకటేష్‌కే దక్కుతుంది.

కానీ, సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు అంటూ రెండు సార్లు సంక్రాంతికి వచ్చి మాస్ హిట్ కొట్టాడు నాగ్. ఈసారి నా సామిరంగతో హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో.. ఈ పోరులో వెంకీ గెలిస్తే తనకి సెంటిమెంట్ పరంగా హ్యాట్రిక్, నాగ్ గెలిస్తే సంక్రాంతి సెంటిమెంట్ పరంగా తనకి హ్యాట్రిక్ దక్కినట్టే.