ఈ ఒక్క సినిమానే విజయ్ ఆంటోనీకి చాలాకాలం పాటు మార్కెట్‌ని తెచ్చిపెట్టింది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఏదో ఒకటి కొట్టకపోదా అనే నమ్మకంతో బయ్యర్లు వస్తూనే ఉన్నారు. సరే ఇవేవి వర్కౌట్ కావడం లేదని బిచ్చగాడు టైటిల్‌కి నంబర్ 2 జోడించి.. వస్తున్నాడు విజయ్ ఆంటోనీ. కాసేపటి కింద రిలీజ్ అయిన ట్రైలర్‌కు.. మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ మొత్తం సూపర్ సస్పెన్స్ క్రియేట్ అయింది.
విజయ్ గురుమూర్తి ఎవరు.. అతని పోలికలతో ఉంది ఎవరు.. ఆ ఎడారిలో శవాలు ఏంటి.. సిస్టర్ సెంటిమెంట్ ఎందుకు వచ్చింది.. అసలు హీరోనే విలనా.. విలన్ హీరోలా కనిపిస్తాడా.. ఇలా రకరకాల ప్రశ్నలు ట్రైలర్ చూసిన తర్వాత తలెత్తుతున్నాయి. తెలుగు, తమిళం భాషల్లో.. మే 19న బిచ్చగాడు 2 రీలీజ్ కాోతోంది. విజయ్ ఆంటోనీ వేల కోట్ల రూపాయిల ఆస్తికి అధిపతిగా కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో యాంటీ బికిలీ అనే పేరుతో రాబిన్ హుడ్‌లా కనిపించాడు. ఐతే మొదటిభాగంలో హీరో భిక్షం ఎత్తుకోవడం వంటివి చూపించడం.
చిన్నప్పటి పాత్రే.. చెల్లెలితో కలిసి బిచ్చం ఎత్తుకున్నట్లు కనిపించింది. ఆ సమయంలో జరిగిన సంఘటన చుట్టూ స్టోరీ తిరుగుతుంది అనిపిస్తోంది. భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకడైన విజయ్ గురుమూర్తి మీద ప్రత్యర్థుల కన్ను ఉంటుంది. లక్షల కోట్ల విలువైన సంపదను హస్తగతం చేసుకోవాలని కుట్రలు పన్నుతూ ఉంటారు. ఈలోగా అతని హత్య జరుగుతుంది. మర్డర్ చేసిన హంతకుడు అచ్చుగుద్దినట్టు అతని పోలికల్లోనే ఉండటం పోలీసులకు న్యాయశాఖకు సవాల్‌గా మారుతుంది.
అయ్యప్ప మాలలో అతి సామన్యుడిగా కనిపించే ఈ వ్యక్తికి గుండెలు పిండేసే ఫ్లాష్ బ్యాక్. అందులో ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు ఉంటారు. ఇదంతా ఒకరి కథేనా లేక ఇద్దరున్నారానేది తెరమీద చూడాలి. అపర కుబేరుడిగా హీరో కనిపిస్తాడు. మరి మరి బిచ్చగాడు 2 అనే టైటిల్ ని ఎందుకు పెట్టారు.. ఈ సినిమా బిచ్చగాడు చిత్రానికి కొనసాగింపుగా ఉంటుందా.. లేదా పూర్తిగా కొత్త సినిమానా అనేది ట్రైలర్ లో అర్థం కాలేదు. ఏమైనా బిచ్చగాడు బజ్‌ను రీక్రియేట్ చేయడంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది. మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తసోంది.