Vijay Devarakonda: విజయ్ నిజంగానే రౌడీ.. డబ్బులు కట్టాల్సిందే.. ఇదేం వివక్ష.?

విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ వాపస్ ఇవ్వాలి.. లైగర్ పంచ్ తో రోడ్డున పడ్డ ఎగ్జిబీటర్స్ ని ఆదుకోవాలి.. సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా కాపాడాలి.. ఇది ఫిల్మ్ నగర్లో రోడ్డెక్కిన బ్యాచ్ చేస్తున్న డిమాండ్.. నిజంగా లైగర్ నిర్మాతల్ని నష్టపరిహారం అడగటం ఓ లెక్క వరకు ఓకే, కాని విజయ్ కూడా చరణ్, చిరంజీవి లా రెమ్యునరేషన్ వాపస్ ఇవ్వాలనటమే పెద్ద కుట్రలా ఉందంటున్నారు.

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 03:23 PM IST

ఎందుకంటే, లైగర్ మూవీకి విజయ్ 25 శాతమే రెమ్యునరేషన్ తీసుకున్నాడు. మిగతా 75 శాతం పారితోషికం సినిమా రిలీజై, హిట్టయ్యాకే పూరీని ఇవ్వమన్నాడు. ఇది చాలా ఇంటర్వూలలో పూరీ,చార్మీ కూడా చెప్పారు. అలాంటప్పుడు లైగర్ వల్ల విజయ్ రెమ్యునరేషన్ పరంగానే కాదు, ఇమేజ్, మార్కెట్ పరంగా అలానే రెండేళ్ల టైం పరంగా నష్టపోయాడు.. అలాంటప్పుడు ఆచార్య ఫ్లాప్ తో చిరు, చెర్రీ రెమ్యునరేషన్ వాపస్ ఇచ్చినట్టు, విజయ్ రిటర్న్ చేయాలనటం పిచ్చి డిమాండ్ లా ఉంది.

అసలే విజయ్ దేవరకొండకి సరైన బ్యాగ్రౌండ్ లేదని, అటు అనసూయ లాంటి వాళ్లు, లేదంటే మరికొందరు, ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. కావాలని రౌడీని బద్నామ్ చేస్తున్నారనే వాదనుంది. ఇలాంటి టైంలో ఈ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల ధర్నాలో విజయ్ పేరు వాడటంతో, వాళ్ల దర్నా మీదే అనుమానాలు పెరిగే పరిస్థితి వచ్చిందంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్ కూడా స్టార్ట్ చేశారు.