Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి పెళ్లి వైపు మనసు మళ్లిందా..? నిజంగానే ఖుషీ మూవీ ఈవెంట్లో పెళ్లి మీద అయిష్టత తగ్గిందన్న విజయ్, అటు వైపు ఆలోచిస్తున్నాడా..? కేవలం ఖుషీ మూవీ ప్రమోషన్‌లో భాగంగానే ఇలా స్టేట్ మెంట్ఇచ్చాడా..? సోషల్ మీడియాలో వినిపిస్తున్న డౌట్లివి. అయితే 34 ఏళ్ల విజయ్‌కి నిజంగానే పెళ్లి వయసొచ్చింది. దాటెళ్లిపోతోంది. ప్రభాస్ అండ్ కో తో పోలిస్తే చిన్నవాడే అయినా, అలా పోల్చుకుంటూ పోతే సల్మాన్‌లా బ్యాచిలర్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది.
ఐతే మరో రెండు మూడేళ్లలో విజయ్ కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. అదేదో యాధృచ్చికంగా అనలేదని తెలుస్తోంది. రష్మికతో విజయ్ పెళ్లి ఫిక్స్ అయినట్టే అన్న ప్రచారం పెరిగింది. ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో కొందరైతే రష్మిక వదినమ్మ అనేస్తున్నారు. మరి రష్మికతో విజయ్‌ది స్నేహమో కాదో దసరాకు తేలబోతోంది. కారణం విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లి ఎనౌన్స్‌మెంట్ అప్పుడే అని ప్రచారం జరుగుతోంది. సో అన్న పెళ్లి తర్వాతే తమ్ముడి పెళ్లి కాబట్టి, ఆలోగా విజయ్ ఇంటి నుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ రావొచ్చనే అంచనాలున్నాయి.