FAMILY STAR: ఓ బ్రహ్మోత్సవం.. ఓ ఫ్యామిలీస్టార్‌.. ఇదేం టార్చర్‌ కొండన్నా..!

విజయ్‌ పర్ఫార్మెన్స్ బాగున్నా.. కేరక్టర్‌కు సూట్ అయినట్లు కనిపించలేదు అనేది మెజారిటీ ఫ్యాన్స్ మాట. లాగినట్లు అనిపించే సీన్లు.. అర్థం కాని లాజిక్‌లు.. అక్కడక్కడ మాత్రమే పేలిన డైలాగులు.. ఇది పేట్ల వారి సీరియల్‌లా ఉంది తప్ప.. రౌడీ మార్క్ సినిమాలా అనిపించలేదు.

  • Written By:
  • Publish Date - April 5, 2024 / 05:04 PM IST

FAMILY STAR: లిఫ్ట్‌లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్‌ పాడైపోద్ది. ఇంత గొప్ప లాజిక్‌ తెలిసిన విజయ్‌ దేవరకొండకి.. స్టోరీ లేకున్నా సరదాకి, కాంబినేషన్‌ బాగుందని కక్కుర్తికి సినిమా చేస్తే అది దొబ్బేస్తుందని మాత్రం తెలియలేదు పాపం. ఇదీ ఫ్యామిలీ స్టార్‌ సినిమా చూసిన ఆడియన్స్‌ అంటున్న మాట. సినీ ఇండస్ట్రీలో ఏ హీరో కెరీర్‌ అయినా.. అతడు సెలెక్ట్ చేసుకునే సినిమాల మీదే డిపెండ్‌ అయి ఉంటుంది.

Sumalatha Ambareesh: బీజేపీలోకి సుమలత.. మాండ్య నుంచి పోటీ చేస్తారా..?

స్టోరీని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యారెక్టర్‌కి మనం పక్కా సెట్‌ అవుతాం అనుకుంటేనే చేయాలి. ఏదీ కాకుండా చేస్తూ పోతా అంటే.. విజయ్‌ దేవరకొండకి వచ్చిన పరిస్థితే అందరికీ వస్తుంది. ఎసుంటి ఎసుంటి సినిమాలే తీసేవాడివి.. ఇలా అయిపోయావ్ ఏంటి కొండన్నా అని జాలి మాటలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విషయంలో జరిగింది అదే. విజయ్‌ పర్ఫార్మెన్స్ బాగున్నా.. కేరక్టర్‌కు సూట్ అయినట్లు కనిపించలేదు అనేది మెజారిటీ ఫ్యాన్స్ మాట. లాగినట్లు అనిపించే సీన్లు.. అర్థం కాని లాజిక్‌లు.. అక్కడక్కడ మాత్రమే పేలిన డైలాగులు.. ఇది పేట్ల వారి సీరియల్‌లా ఉంది తప్ప.. రౌడీ మార్క్ సినిమాలా అనిపించలేదు. ఓ గీతగోవిందం ఉంది కదా సార్.. ఇంకొకటి ఎందుకు అని చిరాగ్గా బయటకు వస్తున్నారు అభిమానులు కొందరు. విజయ్ టైమ్ అంతగా బాగున్నట్లు కనిపించడం లేదు. లైగర్‌ ఫ్లాప్‌ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఆవేశంలో యాక్సెప్ట్ చేశాడో, గీతగోవిందంలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశ పడి యాక్సెప్ట్ చేశాడో కానీ.. ఫ్యామిలీ స్టార్ మాత్రం అభిమానులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఫ్యామిలీలు కనెక్ట్ అవుతారా లేదా అన్నది ఎలా ఉన్నా.. రౌడీ ఫ్యాన్స్‌కు కూడా ఈ సినిమా అసలు ఎక్కడం లేదు. తిట్టుకున్నా పర్లేదు.. 2వందల కోట్ల సినిమా తీస్తున్నాం అని రిలీజ్ ముందు విజయ్‌ చెప్పిన డైలాగులు.. ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయ్. 2వందల కోట్ల ఎలా ఉన్నా.. తిట్టుకోవడం మాత్రం గ్యారంటీ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పేలుతున్నాయ్. మృణాళ్‌ను చూసేందుకు వెళ్లిన బాయ్స్‌.. విజయ్‌ను చూసేందుకు వెళ్లిన గాళ్స్ తప్ప.. సినిమా ఎవరికీ పెద్దగా ఎక్కలేదంటూ జోకులు పేలుతున్నాయ్. ఓవరాల్‌గా విజయ్‌ మార్క్ సినిమా అయితే కాదిది. అందుకే ఐరనే వంచాలా ఏంటనే డైలాగును.. ఐరనే దించాలా ఏంటి అని కోపం చూపిస్తున్నారు సినిమా చూసిన ఫ్యాన్స్ అంతా.