VIJAY DEVARAKONDA: దిష్టి తగిలింది.. అందుకే రహస్య యాగం చేస్తున్నాడా..?

పాన్ ఇండియా మూవీ తీయకముందే దేశవ్యాప్తంగా విజయ్‌కి గుర్తింపు దక్కడమే కాదు, తోటి హీరోలు కుల్లుకునే రేంజ్ కూడా వచ్చేసింది. దీంతో కావాలని యాంటీ ఫ్యాన్స్ తన మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. దానికి తోడు విజయ్ కూడా కాస్త ఆకాశానికి నిచ్చెనేసినట్టు స్టేట్‌మెంట్లు ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 08:10 PM IST

VIJAY DEVARAKONDA: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మంచి నటుడు. పవన్ కళ్యాణ్‌లాగే యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. దీంతో పాటు తనని తాను ప్రమోట్ చేసుకునే తెలివున్న హీరోగా గుర్తింపు ఉంది. వీటికి తగ్గట్టే కెరీర్ బిగినింగ్‌లోనే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. దీంతో ఒక్కసారిగా తను టైర్ 2 హీరోల లిస్ట్ నుంచి చెర్రీ, తారక్, బన్నీ లాంటి పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్‌లో చేరాడు.

Jr NTR: వార్‌ 2లో ఎన్టీఆర్‌దే డామినేషనా..? ఎన్ని గెటప్పుల్లో కనిపిస్తాడంటే..

పాన్ ఇండియా మూవీ తీయకముందే దేశవ్యాప్తంగా విజయ్‌కి గుర్తింపు దక్కడమే కాదు, తోటి హీరోలు కుల్లుకునే రేంజ్ కూడా వచ్చేసింది. దీంతో కావాలని యాంటీ ఫ్యాన్స్ తన మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. దానికి తోడు విజయ్ కూడా కాస్త ఆకాశానికి నిచ్చెనేసినట్టు స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. వీటన్నింటితో తన మీద బురద చల్లే కార్యక్రమాలు సోషల్ మీడియాలో పెరిగాయి. అటు నెగెటివ్ ప్రమోషన్, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్, దీనికి తగ్గట్టే వీక్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయటం వల్ల విజయ్‌కు ఫ్లాపులు వచ్చాయి. దీనికి కారణం.. విజయ్ ఎదుగుదల చూసి దిష్టి తగిలినట్టుందంటున్నారు. అందుకే తను భారీ యాగం చేస్తున్నాడు. అదే గౌతమ్ తిన్ననూరి మూవీ విషయంలో ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాకు యాగం టైటిల్ పెట్టారు. కాదు, ఈ సినిమా ప్రోగ్రెస్ కూడా ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు. ప్రి ప్రొడక్షన్ పనుల్లోనే గ్రాఫిక్స్ సూపర్ విజన్‌కి సంబంధించి చాలా పనులయ్యాయట.

ఇక షూటింగ్ స్పీడప్ చేయటమే మిగిలి ఉంది. అసలు విజయ్ సినిమా మొదలైందంటేనే ఆ హడావిడి వేరు. మొన్న ఫ్యామిలీ స్టార్ విజయ్ ఈవెంట్‌లో సెటిల్డ్‌గా మాట్లాడాడు. ఒకప్పటి విజయ్ కాదనిపించుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా లో ఫ్రోఫైల్ మేయింటేన్ చేస్తున్నాడు. సైలెంట్‌గా ఎలాంటి హడావిడి లేకుండా గౌతమ్ తిన్ననూరి మూవీకి సంబంధించిన హీరోయిన్ సెలక్షన్ నుంచి, షూటింగ్ షెడ్యూల్ వరకు అప్‌డేట్స్ లేకుండానే పని కానిచ్చేస్తున్నాడు. దీంతో ఇకపై యాగం ప్రాజెక్ట్‌తో బిజీ కాబోతున్నాడు.