అక్కడే కోటి ప్రశ్నలు, అనేకమైన అనుమానాలు మొదలౌతున్నాయి. రౌడీ స్టార్ పేరుకి రివర్స్ లోవెలితే కష్టం. విజయ్ అంటేనే అర్జున్ రెడ్డి అనేంతగా తన లుక్ ఫ్యాన్స్ మనసులో ముద్రపడింది. అలాంటి విజయ్ అరవాలి, కరవాలి, తరమాలి కాని నీతులు వల్లిస్తేనో, సున్నితంగా ప్రవర్తిస్తేనో నాటు కోడి పులుసు తినే నోటితో ఉప్పులేని పప్పు తిన్నట్టౌతుంది..
కాని అదే జరిగేలా ఉందట. ఖుసీలో విజయ్ దేవరకొండ మరీ సాఫ్ట్ గా కనిపించబోతున్నాడట. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రెడ్ లా మాస్ గానో, రఫ్ గానో విజయ్ కనిపించడని తెలుస్తోంది. మరి అలాంటి పాత్రల్లో విజయ్ ని జనం చూస్తారా అంటే, గీతా గోవిందం ని ఉదాహరణగా చూపించొచ్చు. కాని గీత గోవిందం లో విజయ్ మ్యాగ్జిమమ్ మంచోడిగా ఉంటాడే కాని, మరీ సాఫ్ట్ రోల్ వేయలేదు. సో ఫస్ట్ టైం విజయ్ ఎక్స్ ట్రీమ్ సాఫ్ట్ రోల్ లో వస్తున్నాడంటేనే, ఖుషీ సినిమా రిజల్ట్ మీద డౌట్లు పెరుగుతున్నాయి. అసలే దర్శకుడికి సక్సెస్ రేటు అంతంత మాత్రం. అందులోనూ వద్దనుకున్న ప్రాజెక్ట్ టేకప్ చేసిన విజయ్ నిర్ణయం ఇంకా ఫ్యాన్స్ ని డౌట్స్ లోకి నెడుతోంది.