రౌడీ ఇంట్లో పెళ్లికి రారండి.. ఏడడుగుల దూరంలో అదృష్టం..

అర్జున్ రెడ్డి తో వచ్చిన ఫేంతో, పాన్ ఇండియా మూవీ చేయటానికి ముందే అంతటి ఇమేజ్ ని తెచ్చుకున్న స్టార్ విజయ్ దేవరకొండ. కాకపోతే లైగర్ ప్లాప్ తో తన తలరాతే రివర్స్ అయ్యింది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవల్లో తన పేరు మారుమోగాల్సింది పోయి, కనీసం టాలీవుడ్ లో కూడా తన జాడ లేకుండా పోయింది.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 04:08 PM IST

అర్జున్ రెడ్డి తో వచ్చిన ఫేంతో, పాన్ ఇండియా మూవీ చేయటానికి ముందే అంతటి ఇమేజ్ ని తెచ్చుకున్న స్టార్ విజయ్ దేవరకొండ. కాకపోతే లైగర్ ప్లాప్ తో తన తలరాతే రివర్స్ అయ్యింది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవల్లో తన పేరు మారుమోగాల్సింది పోయి, కనీసం టాలీవుడ్ లో కూడా తన జాడ లేకుండా పోయింది. ఇంత జరిగాక, వరుసగా డిజాస్టర్లు ఫేస్ చేశాకా? తనని కావాలని తొక్కేస్తున్నారన్నారు… పుష్ప2 తర్వాత సుకుమార్ సినిమా రౌడీ స్టార్ తోనే అన్నారు. కాని ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది.. రామ్ చరణ్ తో సుక్కు సినిమా ఎనౌన్స్ అయ్యింది. కట్ చేస్తే రష్మికతో ప్రేమ ప్రయాణం చేస్తున్నాడంటూ, పాన్ ఇండియా లెవల్లో తన మీద చర్చ జరుగుతోంది. అలా తప్ప, మరెలా కూడా తన గుర్తించి వార్తే లేదు. అపడేట్ రావట్లేదు. కాని సంక్రాంతికి మాత్రం గుడ్ న్యూస్ చెప్పి, ఎడడుగులు దూరంలో తన అద్రుష్టాన్ని మార్చుకోబోతున్నాడట రౌడీ స్టార్… అదెలానో చూసేయండి.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరిస్థితి ఎంత ధారుణంగా ఉందంటే, ఒకప్పడు తన సినిమాలతో, లేదంటే కాంట్రవర్సీస్ తో, కాదంటే కొత్త కాంబినేషన్స్ తో వార్తల్లో ఉండేవాడు. కాని హిట్లులేవు. దానికి తోడు ఊహాఅతీతమైన డిజాస్టర్లతో తన అడ్రస్సే గల్లంతయ్యింది. ఇలాంటి టైంలో బన్నీ, ఎన్టీఆర్, చరణ్ పాన్ ఇండియాని శాసించారు. అర్జున్ రెడ్డి వచ్చి 7 ఏళ్లవుతోంది.

ఈ సెవెన్ ఇయర్స్ తో తన అడ్రస్ మాయమైంది. పాన్ ఇండియా లెవల్లో యష్ నుంచి బన్నీ వరకు ఎందరో ఫేట్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్ క్రేజ్, మార్కెట్ లో మైలేజ్ తోపాటు మొత్తం ఇండస్ట్రీ మీదే గ్రిప్ వచ్చింది.

కట్ చేస్తే ఫ్యామిలీ స్టార్ లాంటి సేఫ్ జోనర్స్ తో కూడా విజయ్ హిట్ మెట్టెక్కలేదు. లోకల్ మార్కెట్ లోకూడా తన మీద పెద్దగా చర్చలేదు. ఇలాంటి టైంలో ఎప్పటి నుంచో రష్మికతో డేటింగ్ లో ఉన్న విజయ్, అలా వార్తల్లోకి ఎక్కాల్సి వచ్చింది

నిజానికి అర్జున్ రెడ్డి హిట్ అయిన జమానాలో, తెలుగు భాష అర్ధం కాకున్నా, మరాఠీలు, మలయాళీలు, ఆఖరికి రాజస్థానీలు, బీహారీలు ఇలా దేశ వ్యాప్తంగా విజయ్ పేరు మారుమోగింది. అప్పటికి పుష్పరాలేదు. పాన్ ఇండియా హీరో అంటే రెబల్ స్టార్ మాత్రమే.. అలాంటి టైంలో ఇక సెకండ్ పాన్ ఇండియా హీరో అంటే విజయే అన్నారు.

లైగర్ హిట్టైతే, మరో ప్రభాస్ గా పేరొస్తుందన్నారు. కాని లైగర్ డిజాస్టరైంది. తర్వాతొచ్చిన ఖుషీ తన ఫ్యూచర్ ని మసిచేసింది. వీటన్నీంటికంటే ఘోరంగా ఫ్యామిలీ స్టార్ తన అడ్రస్ నే గల్లంతయ్యేలా చేసింది.

ఇవన్నీ దెబ్బలు భరించి గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నాడు విజయ్. నిజానికి ఆ ప్రాజెక్ట్ కంటే ముందు సుకుమార్ తో తన పాన్ ఇండియా సినిమా పట్టాలెక్కాలి. కాని లైగర్, ఖుషీ ఫ్లాపులు చూసి, పుష్ప2 తర్వాత రౌడీ తో సినిమా తీయాలన్న ఆలోచనను పక్కన పెట్టాడు సుకుమార్.

చరన్ తో మూవీకి మూవ్ అయ్యాడు. అప్పుడే రౌడీ స్టార్ ని తొక్కేస్తున్న మెగా హీరోలంటూ ఓ డిస్కర్షన్ మొదలైంది.కాని వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డా హీరోతో ఎవరూ రిస్క్ చేయాలనుకోరు. కాబట్టే విజయ్ విజయఘాధకి అక్కడ ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో యానిమల్, పుష్ప2 హిట్లతో దూసుకెళుతున్న రష్మకి వల్ల, తన పేరు లైమ్ లైట్ లోకి వస్తోంది. రష్మిక తో ఏడడుగులు నడవబోతున్న రౌడీ అంటూ వార్తలొస్తున్నాయి. సరైనటైంలో రియాక్ట్ అవుతానంటూ రౌడీ కవర్ చేసినా, సంక్రాంతికి మాత్రం పెళ్లి కబురు విజయ్ ఎనౌన్స్ చేస్తాడనే గుసగుసలు షురూ అయ్యాయి.