నిజానికి ఖుషీ మూవీ కథ ఒకప్పుడు తెలుగులో వెలిగిన లోబడ్జెట్ మూవీ సంపంగి కథే అంటున్నారు. ఓ హిందూ, ఒక ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడటం.. అయితే ఇదేం కొత్త పాయింట్ కాదు. గతంలోనే బాంబే అంటూ మణిరత్నం ఈ పాయింట్ ని టచ్ చేశాడు. కాకపోతే సంపంగిలో కేవలం మతం మాత్రమే ఇబ్బంది కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ పిల్లల మధ్య ప్రేమ వల్ల ఫ్యామిలీస్ ఇబ్బంది పడటం.
సో అచ్చంగా ఇదే పాయింట్ తో ఖుషీ మూవీ తెరకెక్కుతోందట. వేరు వేరు మతాలకు చెందిన ఇద్దరు ఫ్రెండ్స్.. అలానే వాళ్ల పిల్లలే హీరో హీరోయిన్లు.. ఇదే సంపంగి కథ.. ఇప్పుడు ఖుషీ టైటిలే కాదు, స్టోరీ లైన్ కూడా కాపీనే అంటున్నారు. గతంతో మౌనరాగాన్ని నిన్నుకోరిగా తీసిన శివనిర్వాణ కథల్ని ఎత్తేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ డైరెక్టర్ గా మారాడంటున్నారు. ఖుషీ మూవీ మీద ఇలాంటి ప్రచారాలే కాదు, సంపంగి నిర్మాత కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని అప్రోచ్ అయ్యాడని కూడా గుసగుసలు పెరిగాయి.