VIJAY DEVARAKONDA: రౌడీ స్టార్ విజయ్ దేవర కొండ ఓ పెద్ద అగ్ని పర్వతాన్నే మోస్తున్నాడు. అదే రౌడీ స్టార్‌గా తనకున్న ఇమేజ్. ఈ ఇమేజ్ అర్జున్ రెడ్డితో వచ్చింది. కాని, గీత గోవిందం లాంటి మరో హిట్ పడటం, అది వందకోట్లు రాబట్టడంతో లెక్కలు మారాయి. అర్జున్ రెడ్డితో నటుడిగా, స్టార్‌గా దేశవ్యాప్తంగా విజయ్‌కి పేరొచ్చింది. యూత్‌లో ఊహించనంత ఫాలోయింగ్ పెరిగింది.
Jr NTR: నెక్స్ట్ వార్ ఇక్కడే.. ఈసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘యుద్ధం’ ఇక్కడే
కాని గీతగోవిందం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ పెరగటంతో పాటు, వందకోట్ల స్టార్‌గా మారాడు. ఇన్ని జరిగాక మరో రెండు, మూడు హిట్లు పడ్డా.. లేదంటే లైగర్ పాన్ ఇండియా హిట్ అయ్యుంటే ఎవరూ తనని టచ్ చేయలేని స్థాయికి వెళ్లేవాడు. కాకపోతే లైగర్ ఫ్లాపైంది. ఖుషీ దారి తప్పింది. ఫ్యామిలీ స్టార్ అయితే థియేటర్స్‌తో పాటు ఓటీటీలో కూడా జనాల అటెన్షన్ కంటే ట్రోలర్స్ అటెన్షన్‌నే అట్రాక్ట్ చేసింది. ఇన్ని జరిగినా రౌడీ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ సౌత్, నార్త్‌లో ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే లైగర్ ఓపెనింగ్స్, ఖుషీ ఓపెనింగ్స్, ఆఖరికి ఈ రెండు ప్లాపుల తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ చూస్తే, విజయ్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఆరాట పడుతున్నారో తెలుస్తుంది. కాకపోతే ఇవేవీ హిట్ కాలేదు. దీన్ని బట్టి చూస్తే అమాంతం పెరిగిన ఇమేజ్‌లో విజయ్ ఇరుక్కున్నాడని తెలుస్తోంది.
కొన్ని సార్లు తలకుమించిన భారంగా ఇమేజ్ మారితే, ఆ ఇమేజ్‌కు తగ్గ కథ దొరక్కపోతే హిట్ బదులు ఫ్లాపులే పడే ఛాన్స్ ఉంది. రౌడీ స్టార్ విషయంలో ఇదే జరుగుతోంది. తనకి ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఇంకా తన సినిమాల ఓపెనింగ్స్ అదిరిపోవటానికి కారణం ఏమాత్రం తగ్గని క్రేజ్, ఇమేజ్. కాని ఆ ఇమేజ్‌కి తగ్గ కథలు రాక, దర్శకుల విజన్ బాగోలేక ఇప్పటికీ విజయ్ ఇబ్బంది పడాల్సివస్తోంది.