సినిమా వాళ్ళ జీవితాలపై ఏ న్యూస్ వచ్చినా మీడియాకు పండుగే. చిన్న రూమర్ వచ్చినా అది నిజం అని తెలిసే వరకు వెంటాడుతూ ఉంటారు. దాదాపు అయిదేళ్ళ నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ స్టోరీ గురించి మీడియాలో ఏదోక న్యూస్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు రిలేషన్ లో ఉన్నారంటూ నేషనల్ మీడియా కూడా కథనాలు రాసేసింది. అన్ స్టాపబుల్ షోలో వీళ్ళు ఫోన్ మాట్లాడిన ఓ రీల్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. అప్పుడే జనాలకు వీరి గురించి క్లారిటీ వచ్చింది. అప్పుడప్పుడు ట్రిప్స్ కు కూడా వెళ్తూ ఉంటారు.
ఇప్పటి వరకు రష్మిక గాని విజయ్ గాని ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఓపెన్ అయ్యాడు. బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ జస్లీన్ రాయల్ ‘హీరీయే హీరీయే’ సాంగ్ సక్సెస్ కాగా… ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రాధికా మదన్ కాంబినేషన్ లో ‘సాహిబా’ సాంగ్ మేకింగ్ జరిగింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. దీనితో టీం… చిట్ చాట్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ అనేక విషయాలను బయటపెట్టాడు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు.
రిలేషన్ గురించి ఓ ప్రశ్న అడగగా… నేను నా కో స్టార్ ఒకరితో డేటింగ్ లో ఉన్నాను అని బయటపెట్టాడు. నా వయసు 35, నేను ఒంటరిగా ఉంటానని మీరు ఎలా భావించారు అని నిలదీశాడు. రొమాంటిక్ రిలేషన్షిప్ లోకి వెళ్లేముందే నేను ఆ వ్యక్తులతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పుకొచ్చాడు. నేను ప్రత్యేకించి డేట్లకు వెళ్ళను అని క్లారిటీ ఇచ్చాడు. ఎవరితోనైతే చాలా కాలం నుండి ఫ్రెండ్షిప్ ఉంటాదో వాళ్ళతోనే బయటకెళ్తానన్నాడు. . నాకు షరతులు లేని ప్రేమ కావాలన్న విజయ్… నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం తెలుసన్నాడు.
రీసెంట్ గా విజయ్, రష్మిక దీపావళి కూడా కలిసి జరుపుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. దీంతో విజయ్, రష్మికతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. ఇక యూత్ కు ఈ సందర్భంగా పలు సలహాలు కూడా ఇచ్చాడు విజయ్. ప్రేమ అనేది తప్పకుండా పుడుతుంది అబ్బాయిలు… మీరు ఇంకా యంగ్‌గానే ఉన్నారు కాబట్టి కాస్త టైమ్ తీసుకోండి అంటూ అడ్వైజ్ ఇచ్చాడు. అన్నిటికంటే ముందుగా కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. లవ్ అనేది చెడ్డ విషయం కాదు, దానికి మనం కాస్త టైమ్ ఇవ్వాలని… లవ్ విషయంలో 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్నవారికంటే బెటర్‌గా ఆలోచిస్తారన్నాడు. టైం వచ్చినప్పుడు అవే జరుగుతాయన్నాడు.