Vijay Devarakonda: ప్రతి సారి విజయ్‌ను టార్గెట్ చేస్తున్నయాంటీ ఫ్యాన్స్..

విడులైన 5 రోజుల్లో అమెరికాలో 1.6 మిలియన్లు అంటే రూ.1.2 కోట్లు వచ్చాయి. మనదేశంలో కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. అయినా ఖుషీ డిజాస్టర్ అంటూ ప్రచారం చేయటం విజయ్‌ని బాధపెడుతోంది.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 06:04 PM IST

Vijay Devarakonda: ఖుషీ మూవీ ఫ్లాప్, డిజాస్టర్, వసూళ్లు లేవు.. ఇవి సోషల్ మీడియాలో పెరిగిన కామెంట్లు. కావాలని చేస్తున్న ట్రోలింగ్స్. ఓ పక్క విడులైన 5 రోజుల్లో అమెరికాలో 1.6 మిలియన్లు అంటే రూ.1.2 కోట్లు వచ్చాయి. మనదేశంలో కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. అయినా ఖుషీ డిజాస్టర్ అంటూ ప్రచారం చేయటం విజయ్‌ని బాధపెడుతోంది.

అందుకే ఫేక్ ఎకౌంట్లు, యాంటీ ఫ్యాన్స్ కుట్రని తన మాటలతో ఎదుర్కొంటున్నాడు. విచిత్రం ఏంటేంటే ఖుషీ మూవీకి వసూళ్లు బానే వస్తున్నాయి. కాని ఇది బ్లాక్ బస్టర్ అయ్యేంత కంటెంట్ ఉన్న మూవీ అని ఎవరూ మనస్పూర్తిగా ఒప్పుకోలేకపోతున్నారు. విజయ్ దేవరకొండ ఖుషీలో బాగానే నటించాడు. సమంత లుక్స్ బాలేకున్నా బానే నటించింది. పాటలు అదిరిపోయాయి.. ఈమధ్య ఫ్లాప్ మూవీలు చూసి విసిగిపోయిన జనం ఖుషీని చూసి బాగుందంటున్నారు. కాని ఓరేంజ్ హిట్ మూవీ అనేంత గొప్పగా శివ నిర్వాణ ఏం తీయలేదనే కామెంట్స్ ఉన్నాయి. సఖిని చెడగొట్టి తీస్తే, అదే ఖుషీ అనే కామెంట్లు మరీ నెగెటీవ్ గా ఉన్నా, మేకింగ్ పరంగా, స్క్రిప్ట్ పరంగా ఈ మూవీ కాస్త వీక్ అనుకోక తప్పదంటున్నారు.

కేవలం విజయ్ దేవరకొండ క్రేజ్, ఇమేజ్ కి పాటలు, టైంపాస్ సీన్లు కలిసొచ్చి ఖుషీ నడుస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. బేసిగ్గా విజయ్ మూవీ వస్తోందటే యాంటీ ఫ్యాన్స్ చేసే కుట్రలు తెలిసిందే.. కాని ప్రతీ సారి వాళ్లదే తప్పనలేం. దర్శకుల తప్పులతో విజయ్ కి తిప్పలు తప్పట్లేదనే మాట మాత్రం ఇంకా రీసౌండ్ చేస్తోంది.