Vijay Devarakonda: దర్శకుడిగా మారబోతున్న రౌడీ.. మంచి కథ దొరికితే డైరెక్షన్‌ చేస్తానంటున్న విజయ్

మంచి కథ దొరికితే తాను కూడా దర్శకత్వం చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు వరుస సినిమాలు ఉండటం కారణంగా డైరెక్షన్‌ విషయంలో స్టెప్‌ తీసుకోలేకపోతున్నా అంటూ చెప్పాడు. కానీ ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా దర్శకుడిగా సినిమా తీస్తానని చెప్పాడు రౌడీ హీరో.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 05:19 PM IST

Vijay Devarakonda: టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండకు దర్శకత్వం చేయాలని ఉందట. మంచి కథ దొరికితే డైరెక్షన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఖుషీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు విజయ్‌ దేవరకొండ. హీరోగా తెలుగు ప్రేక్షకులు తనను ఇంత ఆదరిస్తారని విజయ్‌ ఎప్పుడూ అనుకోలేదన్నాడు. కానీ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. లైగర్‌ సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు కూడా తన ఫ్యాన్స్‌ తనకు ఎంతో సపోర్ట్‌ ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు విజయ్‌.

విజయ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇంతకాలం హీరోగా చేసినప్పటికీ, డైరెక్షన్‌లో కూడా చాలా ఇంట్రెస్ట్‌ ఉంది. మంచి కథ దొరికితే తాను కూడా దర్శకత్వం చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు వరుస సినిమాలు ఉండటం కారణంగా డైరెక్షన్‌ విషయంలో స్టెప్‌ తీసుకోలేకపోతున్నా అంటూ చెప్పాడు. కానీ ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా దర్శకుడిగా సినిమా తీస్తానని చెప్పాడు రౌడీ హీరో. విజయ్‌ చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనికి.. కొందరు ఫ్యాన్స్‌ సపోర్ట్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం నెగటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. హీరోలుగా వచ్చి దర్శకులుగా ఫెయిల్‌ అయిన హీరోలు చాలా మంది ఉన్నారని, హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న టైంలో దర్శకత్వం ఎందుకని కొందరు ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

కొందరు మాత్రం విజయ్‌ని సపోర్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడున్న యూత్‌ని అర్థం చేసుకోవడంలో విజయ్‌ చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటాడు. అలాంటి వ్యక్తి డైరెక్షన్‌ చేస్తే సినిమా యూత్‌కి బాగా రీచ్ అవుతుంది. కాబట్టి విజయ్‌ డైరెక్షన్‌ చేయడంలో తప్పు లేదంటున్నారు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రౌడీ దర్శకుడిగా మారితే ఎలాంటి రిజల్ట్‌ వస్తుందో చూడాలి మరి.