బన్నీ త్రివిక్రమ్ కాంబోలో ఛాన్స్ కొట్టేసాడు… దట్ ఈజ్ కొండ

టాలీవుడ్ యంగ్ హీరోలు ఇప్పుడు... సీనియర్ హీరోల వెంట, స్టార్ హీరోల వెంట పడుతున్నారు. ముఖ్యంగా విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ స్టార్ హీరోలతో ఎక్కువగా స్నేహం చేయడం వాళ్ల సినిమాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు చేయడం, వంటివి గట్టిగానే చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 07:13 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోలు ఇప్పుడు… సీనియర్ హీరోల వెంట, స్టార్ హీరోల వెంట పడుతున్నారు. ముఖ్యంగా విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ స్టార్ హీరోలతో ఎక్కువగా స్నేహం చేయడం వాళ్ల సినిమాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు చేయడం, వంటివి గట్టిగానే చేస్తున్నారు. విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ నందమూరి హీరోలతో ఎక్కువగా స్నేహం చేయడం రీసెంట్ టైమ్స్ లో హాట్ టాపిక్. ఇప్పుడు విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ తో స్నేహం చేయడం టాలీవుడ్ లో సెన్సేషన్ అవుతుంది.

రష్మిక కారణంగా అల్లు అర్జున్ కు దగ్గర అయిన విజయ్ దేవరకొండ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఒక జాకెట్ కూడా అల్లు అర్జున్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ జాకెట్ తోనే అల్లు అర్జున్ ప్రీమియర్ షో కూడా వెళ్ళాడు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ ఎక్కువగా జూబ్లీహిల్స్ లోనే బన్నీ ఇంటి వద్దనే ఎక్కువగా కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకు సరైన హిట్ లేదు. దీనితో అల్లు అర్జున్ తో స్నేహం చేయడం ద్వారా తన సినిమాలకు క్రేజ్ పెంచుకోవాలని కూడా విజయ్ దేవరకొండ భావిస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది.

అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండకు విజయ దేవరకొండ ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇచ్చే న్యూస్ చెప్పాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అల్లు అర్జున్తో తాను చేయబోయే సినిమాలో విజయ్ దేవరకొండకు ఒక పవర్ఫుల్ రోల్ ఇవ్వనున్నాడు త్రివిక్రమ్. వాస్తవానికి పుష్ప సినిమాలో గెస్ట్ రోల్ ఇచ్చేందుకు సుకుమార్ ప్లాన్ చేసిన అది సాధ్యం కాలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం విజయ్ దేవరకొండ కోసం ఒక పవర్ఫుల్ రోల్ ని ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. ముందు ఈ రోల్ కోసం ఒక మలయాళ హీరో తో చర్చలు జరిపినా రష్మిక ఒత్తిడి కారణంగానే విజయ్ దేవరకొండకు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ ఒక గెస్ట్ రోల్ చేశాడు. ఆ రోల్ కు పెద్దగా క్రేజ్ ఏమి రాలేదు. బన్నీ కూడా విజయ్ దేవరకొండ ను తీసుకోవడానికి రెడీ అయ్యాడట. అయితే అది నెగిటివ్ రోల్ అనే టాక్ కూడా ఉంది. కానీ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండే రోల్ అని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినబడుతోంది. ఇక ఈ సినిమాను 2026 సంక్రాంతి గిఫ్టుగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.