FAMILY STAR: విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందునుంచే నెగెటివిటీ మూటగట్టుకున్న ఈ చిత్రం మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుందంటూ పబ్లిసిటీ చేసినప్పటికీ కలెక్షన్లు మాత్రం పెరగలేదు.
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. మూడు కోట్ల ఇండ్ల నిర్మాణానికి హామీ
దీంతో విజయ్ కెరీర్లో మరో ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది. అయినప్పటికీ థియేటర్లలో ఇంకా ఈ చిత్రం కొన్ని చోట్ల ఆడుతోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మరోవారంలో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని అమెజాన్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి థియేటర్లలో ఆదరణ తగ్గుతుండటంతో ఓటీటీలో త్వరగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీని ప్రకారం.. విడుదలైన నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అంటే మే 3 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. త్వరగానే ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి రాబోతుండటంతో ప్రేక్షకులు హ్యాపీ ఫీలవుతున్నారు.
థియేటర్లలో ఆడకపోయినా.. ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నారు. సినిమాలోని ఫ్యామిలీ, యూత్‌ఫుల్ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయని చిత్ర బృందం చెబుతోంది. థియేటర్లలో ఫ్లాప్ అయి.. ఓటీటీలో హిట్ అయిన సినిమాల్లాగే ఇది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిట్ కొడుతుందేమో చూడాలి.