FAMILY STAR: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ నెల 5న విడుదలైంది. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా చేసింది. గీతగోవిందం తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో వచ్చిన మూవీ కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది.
SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్‌మెంట్
సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీకి నచ్చే అంశాలు, సింపుల్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ.. కథ, కథనాలు ఆడియెన్స్‌కు నచ్చలేదు. దీంతో సినిమా థియేటర్ల దగ్గర సందడి చేయలేదు. అయితే, ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన మూడు వారాల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వస్తుండటం విశేషం. నిజానికి ఇంకొన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ, సినిమా డిజాస్టర్ కావడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తోంది చిత్ర బృందం.
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఆయనకు నష్టాలే అందించింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎంతమేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి. ఇక.. ఈ వారమే తెలుగులో టిల్లూ స్క్వేర్, భీమా వంటి సినిమాలు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి.