FAMILY STAR REVIEW: గోవర్ధన్ ది పక్కా మిడిల్ క్లాస్. ఇద్దరు అన్నయ్యలు, వాళ్ల పిల్లలు.. ఆ బాధ్యత కూడా తనే తీసుకొంటాడు. వదినల్ని గౌరవంగా చూసుకొంటాడు. తన పెత్తనంతో ఇంటినీ, ఖర్చుల్ని అదుపులో పెట్టుకొంటాడు. ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోడు. గోవర్థన్ పెంట్ హోస్‌లోకి ఇందు అద్దెకు వస్తుంది. మెల్లగా.. గోవర్థన్ కుటుంబంతో కలిసిపోతుంది. గోవర్ధన్‌కీ, ఇందుకీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. గోవర్థన్ తన కుటుంబంలోకి ఇందును ప్రేమ పూర్వకంగా ఆహ్వానించే తరుణంలో ఇందు గురించిన ఓ నిజం తెలుస్తుంది. తన ఇంటికి ఇందు కావాలనే వచ్చిందని, దాని వెనుక ఓ మిషన్ ఉందని అర్థం అవుతుంది. అప్పుడు గోవర్థన్ ఏం చేశాడు? అసలింతకీ ఇందు గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ తరవాత ఏం జరిగింది? అనేదే కథ.
Aarti Chabria : 41ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్
పర్పామెన్స్..
విజయ్ చూడ్డానికి కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా కనిపించాడు. సినిమాని దాదాపుగా తన భుజాలపై మోశాడు. నటన, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. మృణాల్ ఓకే అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఫ్రేముల్లో విజయ్ కంటే.. పెద్దదానిలా కనిపించింది. జగపతిబాబు రొటీన్ రిచ్ డాడ్ పాత్రలో అలవాటైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏదో లాగించేశాడు. వెన్నెల కిషోర్ ఉన్నా.. తన మార్క్ కామెడీ ఈ సినిమాలో కనిపించదు. రోహిణి పర్వాలేదనిపించింది. మిగతా వారు తమ పరిధి మేరకు అలరించారు.
టెక్నికల్ టీం..
రచయితలు దర్శకులు అయితే.. స్క్రిప్టు పకడ్బందీగా ఉంటుంది. బలమైన కాన్‌ఫ్లిక్ట్ రాసుకొంటారు. అయితే.. ఈ రెండు విషయాల్లోనూ పరశురామ్ చేతులెత్తేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏదో జస్ట్ ఒకే అనిపించేలా ఉన్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా మృణాల్ థాకూర్, విజయ్ మధ్య కెమెస్ట్రీ ఆహా, ఓహో అనే రేంజ్ లో వర్కవుట్ కాలేదని అంటున్నారు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగిందని వెల్లడిస్తున్నారు. ఇక సెకండ్ ఆఫ్ కూడా సోసో గానే సాగిందని.. మరీ ముఖ్యంగా చాలా సీన్లు రియలిస్టిక్‌గా అనిపించలేవని, యూఎస్ లో సాగే సీన్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు.ఎమోషనల్ గా సినిమా ఎక్కడ కూడా కనెక్ట్ అవదని.. ఏదో అలా సాగిపోతుందని తెలుపుతున్నారు. కొంతమందైతే సీరియల్ తో ఫ్యామిలీ స్టార్ సినిమాను కంపేర్ చేస్తున్నారు. ఎడిటింగ్‌కు చాలా వరకు కత్తెర చెప్పాల్సి ఉందని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా పేలలేదని చెబుతున్నారు. పరుశురామ్, విజయ్ దేవరకొండ అంటే మినిమిం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే.. గీతా గోవిందంలో 50 పర్సెంట్ కూడా సాటిస్‌ఫై చేయలేకపోయారని వెల్లడిస్తున్నారు.