FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే

ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

  • Written By:
  • Updated On - March 24, 2024 / 09:00 PM IST

FAMILY STAR: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో కంగనా.. ఆ పార్టీ నుంచే పోటీ..

దీంతో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 28, 2024న రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు విడుదలకాగా.. మధురము కదా అనే మూడో పాటను మార్చి 25, సోమవారం రిలీజ్ చేయబోతున్నారు. వరుసగా సాంగ్స్, ట్రైలర్‌తో ప్రమోషనల్ యాక్టివిటీస్ పెంచేస్తోంది ఫ్యామిలీ స్టార్ మూవీ యూనిట్. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గీత గోవిందం చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించారు. యూత్ ఫుల్, ఫ్యామిలీ అంశాలతో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరోవైపు సినిమా ప్రమోషన్ ప్రారంభించబోతున్న మృణాల్ ఠాకూర్.. ఆదివారం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.