FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ విజయ్‌కి అన్నీ మంచి శకునములే..?

ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి, మాస్ ప్రమోషన్స్ చేయలేరు. సరే.. ఏదేమైనా ఫ్యామిలీ డ్రామాలు ఏమాత్రం బాగున్నా వసూళ్లు వస్తాయి. పరశురామ్, విజయ్ గతంలో గీతగోవిందంతో హిట్ కొట్టారు. కాబట్టి, కాంబో కలిసొచ్చే ఛాన్సే ఎక్కువ. ఇది మామూలు టాక్ తెచ్చుకున్నా యావరేజ్‌గా నైనా ఆడుతుంది.

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 06:09 PM IST

FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ మూవీ పక్కా హిట్ మెట్టెక్కే ఛాన్స్ ఎక్కువుంది. ఇది కేవలం ఫ్యాన్స్‌తోపాటు ఓ సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. ఇది హిట్ అయితే విజయ్ దేవరకొండకి కలిసొచ్చేదేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ మూవీ సక్సెస్ అయితే ఇదే రౌడీ స్టార్‌కి తొలి ప్యాన్ ఇండియా హిట్‌గా మారుతుంది. అర్జున్ రెడ్డి కేవలం తెలుగులో ఆడినా, ఆ భాషరాకున్నా కన్నడ, మలయాళ, తమిళ ప్రేక్షకులు ఆమూవీని చూశారు.

Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్‌గా రజినీ.. సినిమా బ్యాక్‌డ్రాప్ మామూలుగా లేదుగా..!

హిందీలో కూడా విజయ్‌కి అలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. కాబట్టి, పాన్ ఇండియా మూవీ చేయకముందే తనకి ఆ ఇమేజ్ ఉంది. ఒక్క పాన్ ఇండియా హిట్ పడితే తన లెవలే మారిపోతుంది. కాని లైగర్‌తో అలాంటి ఆశలు పెట్టుకుంటే, నిరాశపడాల్సి వచ్చింది. ఐతే ఫ్యామిలీ స్టార్ పాన్ ఇండియా లెవల్లో 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాని లైగర్ రేంజ్‌లో హెవీ ప్రమోషన్స్ లేవు. అనవసరంగా అంచనాలు పెంచకూడదనేది ఒక కారణం. ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి, మాస్ ప్రమోషన్స్ చేయలేరు. సరే.. ఏదేమైనా ఫ్యామిలీ డ్రామాలు ఏమాత్రం బాగున్నా వసూళ్లు వస్తాయి. పరశురామ్, విజయ్ గతంలో గీతగోవిందంతో హిట్ కొట్టారు. కాబట్టి, కాంబో కలిసొచ్చే ఛాన్సే ఎక్కువ. ఇది మామూలు టాక్ తెచ్చుకున్నా యావరేజ్‌గా నైనా ఆడుతుంది కాని, ఫ్లాప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

కాబట్టి, ఎలా చూసినా ఫ్యామిలీ స్టార్ విజయ్‌కి కలిసొచ్చే అవకాశాలే ఎక్కువ. తక్కువ ప్రమోషన్ చేసినా, పాన్ ఇండియా లెవల్లో ఇది ఏమాత్రం ఆడినా, మరీ బాహుబలి, త్రిబులు ఆర్ స్టార్స్ రేంజ్ మార్కెట్ కాని, ఇమేజ్ కాని రాకపోవచ్చు. కాని మార్కెట్ పెరుగుుతంది. రౌడీ స్టార్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ వల్ల ఆ తర్వాత చేయబోయే సినిమా రేంజ్ మాత్రం ప్రభాస్, బన్నీ, చెర్రీ, తారక్ మూవీల రేంజ్‌లోనే హైప్ క్రియేట్ చేస్తుంది.