Family Star Trailer: హిట్టు ఖాయమా.. ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్ ఎలా ఉంది..?

గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన పరశురామ్ దర్శకత్వంలో కలిసి బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సోష‌ల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్ ట్రెండ్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 02:09 PM IST

Family Star Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ఇప్పుడో బ్లాక్ బస్టర్ కావాలి. ‘లైగర్’తో పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న విజయ్.. ‘ఖుషి’తో కాస్త ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘ఫ్యామిలీ స్టార్’పైనే పెట్టుకున్నాడు. ఇప్పటికే తనకు ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన పరశురామ్ దర్శకత్వంలో కలిసి బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సోష‌ల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్ ట్రెండ్ అవుతోంది.

Jr NTR: ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్.. క్రేజీ అప్‌డేట్..

ట్రైలర్ విషయానికి వస్తే.. స్వామి నా జీవితంలో కొత్తగా బ్రేక్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు.. కానీ ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు.. అంటూ విజయ్‌ దేవరకొండ స్టైల్‌ డైలాగ్స్‌తో షురూ అయింది. మీకు ఫుల్లుగా ప‌డిపోయాంటూ మృణాల్ ఠాకూర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చెప్పే రొమాంటిక్ డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. భ‌య‌ప‌డాలిరా ఇంకోసారి ఎవ‌రైనా చుల‌క‌న‌గా మాట్లాడాలంటే అంటూ విజ‌య్ విల‌న్స్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. కోపం ఎగిరిపోతుంద‌ంటే న‌న్ను కొట్టవే బాబు అంటూ ట్రైల‌ర్ చివ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌గానే మృణాల్ అత‌డి చెంప‌పై గ‌ట్టిగా ఒక్కటి కొట్టడం ఆక‌ట్టుకుంటోంది. విజయ్ క్యారెక్టరైజేషన్, మృణాళ్‌తో లవ్ ట్రాక్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అలాగే చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉన్నాయి. అప్పట్లో ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందో తెలుసు. ఈసారికి ఆ డైలాగ్‌ని ఈ ట్రైలర్‌లో పెట్టలేదు. కానీ, అంతకు మించిన డైలాగ్స్, ఫ్యామిలీ బాండింగ్, లవ్ అండ్ ఎమోషన్స్‌ని హైలెట్ చేశారు. మొత్తానికి ఈసారి మాత్రం విజయ్ ఖాతాలో అదిరిపోయే హిట్టు పడబోతోంది అంటున్నారు. ‘గీత గోవిందం’ వైబ్స్‌తోనే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ వస్తోంది.

పరశురామ్‌కి తోడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘ఫ్యామిలీ స్టార్’కి మెయిన్ పిల్లర్‌గా ఉన్నాడు. ఏప్రిల్ నెలలో వేరే పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో ‘ఫ్యామిలీ స్టార్’కి మంచి టాక్ వచ్చిందంటే చాలు.. ఈ సమ్మర్ సీజన్ అంతా దున్నేసే ఛాన్స్ కనిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా తెలుస్తోంది. మూవీ టేకింగ్ కూడా నెక్ట్స్ లెవల్లో, ఎంతో రిచ్‌గా ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా లక్కీ ఛార్మ్ మృణాల్ ఠాకూర్ నటించింది. ఇప్పటికే తెలుగులో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మృణాళ్‌కి ఇది మూడో సినిమా. ‘గీత గోవిందం’ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గోపీ సుందర్ సపోర్ట్ కూడా ‘ఫ్యామిలీ స్టార్’కి ఉంది. మొత్తంమీద.. పర్ఫెక్ట్ టైములో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండకి అత్యద్భుతమైన విజయాన్నందిస్తుందేమో చూడాలి.