Vijay Devarkonda: ప్రభాస్ మూవీలో రౌడీ హీరో.. విజ‌య్‌ దేవ‌ర‌కొండ జాక్‌పాట్..!

స్టార్ హీరో, రౌడీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా క‌ల్కి 2898 AD చిత్రంలో న‌టిస్తున్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కిలో విజయ్ నిడివి కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌న్న టాక్ ఇప్పుడు ఈ మూవీపై హైప్‌ను మ‌రింత‌గా పెంచేసింది.

  • Written By:
  • Publish Date - January 20, 2024 / 03:16 PM IST

Vijay Devarkonda: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న క‌టౌట్‌కు త‌గ్గ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. స‌లార్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత‌.. పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కుతున్న మూవీ క‌ల్కి 2898 AD. సైన్స్ ఫిక్ష‌న్- ఫాంట‌సీ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి బిగ్ స్టార్స్ న‌టిస్తున్నారు. దీంతో.. ఈ సినిమాపై ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాలున్నాయి. ఇప్పుడు ఇలాంటి స‌మ‌యంలో ఈ మూవీకి సంబంధించిన మ‌రో క్రేజీ న్యూస్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

Vijay rashmika Engagement : విజయ్ దేవరకొండ – రష్మికల ఎంగేజ్ మెంట్? క్లారిటీ ఇచ్చేసిన రౌడీ హీరో..

స్టార్ హీరో, రౌడీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కిలో విజయ్ నిడివి కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌న్న టాక్ ఇప్పుడు ఈ మూవీపై హైప్‌ను మ‌రింత‌గా పెంచేసింది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ నాగ్ అశ్విన్ మధ్య మంచి అనుబంధం ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంలో గెస్ట్ రోల్ చేశాడు. అలాగే మ‌హాన‌టి, జాతి ర‌త్నాలులోను గెస్ట్ రోల్ చేశాడు. దీంతో ప్రభాస్ కల్కి సినిమాలో మ‌రోసారి గెస్ట్ రోల్‌లో విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇది అధికారికంగా కన్ఫార్మ్ కాకపోయినా.. ఇప్పుడు దేవరకొండ కూడా గెస్ట్ రోల్‌లో కనిపించ‌నున్నాడ‌న్న వార్త ఫ్యాన్స్‌కు విప‌రీత‌మైన కిక్ ఇస్తోంది. కల్కి 2898 AD మూవీ 2024 మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయ‌ని స‌మాచారం.

ఇప్పటికే భారీ స్థాయిలో ప్రమోషన్స్ షురూ చేసేశాడు నాగ్ అశ్విన్. ఇక రానున్న రోజుల్లో అంత‌ర్జాతీయ సినిమా ఉత్స‌వాల్లో నాగ్ అశ్విన్ కల్కి సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఇది భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఫాంటసీ చిత్రంగా రూపొందుతుంది. ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ కథ అంశంతో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో హీరోయిన్స్‌గా దిశాపటాని, దీపికా పదుకొనే నటిస్తున్నారు. భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ చేస్తున్న ఈ ప్రయోగాత్మకంగా చిత్రం.. సినీ చరిత్రలోనే ఒక అద్భుతంగా మారుతుందని ఫ్యాన్స్, సినీ ప్రముఖులు అంటున్నారు. మ‌రి ఈ ప్ర‌యోగం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.