Vijay Devarakonda : విజయ్ దేవరకొండ భారీ యాక్షన్

చివరగా విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్‌’(The Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో.. పరుశురాం (Parushuram) తెరకెక్కించిన ఈ సినిమా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

చివరగా విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్‌’(The Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో.. పరుశురాం (Parushuram) తెరకెక్కించిన ఈ సినిమా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక.. ఫైనల్‌గా ఫ్లాప్‌గా నిలిచింది. కానీ ఓటిటిలో మాత్రం ఫ్యామిలీ స్టార్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమా రౌడీ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. అందుకే.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే.. ఈ చిత్రం నుండి రీసెంట్‌గా విజయ్ బర్త్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ త్వరలో అదిరిపోయే స్నీక్ పీక్‌ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఓ లెటర్ రిలీజ్ చేసింది. దీంతో నెక్స్ట్ అప్టేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రజెంట్ ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలక ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారట. అది కూడా ఇంటర్వల్ ఎపిసోడ్ అని తెలుస్తోంది.

సినిమాలోనే ఇది భారీ యాక్షన్ సీక్వెన్స్ అని అంటున్నారు. విజయ్ కెరీర్ బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుందని సమాచారం. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఈ స్పై థ్రిల్లర్‌లో హీరోయిన్ ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ (Anirudh) సంగీతం (Music) అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.