Vijay Deverakonda: అర్జున్ రెడ్డి హిట్‌తో పాన్ ఇండియా లెవల్లో రౌడీ స్టార్ పేరు మారుమోగింది. భాష అర్ధం కాకున్నా తెలుగు సినిమాను, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ జనం చూసి ఫిదా అయ్యారు. ముఖ్యంగా విజయ్‌కి ఫ్యాన్స్ అయ్యారు. అలాంటి స్టార్ ఈపాటికి ఎక్కడికో ఎదిగిపోవాలి. కాని అది జరక్కుండా లైగర్ ఫ్లాప్ అడ్డుపడింది. పాన్ ఇండియా బిగ్ స్టార్‌గా మారాల్సిన విజయ్ ఖుషీ లాంటి మూవీలు గట్టెక్కితే చాలానుకునే పరిస్తితి వచ్చింది. ఆఖరికి ఖుషీ కూడా కలిసిరాకపోవటంతో విజయ్ ఆలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చింది.
అంతెందుకు సుకుమార్ కూడా రౌడీస్టార్‌తో మూవీ ప్లాన్ చేశాడు. పుష్ప 2 తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందన్నారు. కాని లైగర్ ఫ్లాపుతో తను కూడా వెనక్కి వెళ్లాడు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి కూడా విజయ్‌తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాడనేలోపే అటునుంచి ఆఫర్ ఆవిరైంది. అంతగా లైగర్ రౌడీ కెరీర్‌ని డ్యామేజ్ చేసింది. దీంతో ఇప్పుడు విజయే ఒక అడుగు ముందుకేసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ని కలిశాడు. సినిమా సైన్ చేశాడు. కరణ్ చెప్పిన కథని కూడా ఓకే చేశాడు. కరణ్ మాత్రం ఆ ప్రాజెక్ట్‌ని ఓ సౌత్ దర్శకుడితో తెరకెక్కించాలనుకుంటున్నాడట. సో.. దర్శకుడు దొరికితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కన్ఫామ్. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో చేస్తున్న సినిమా రెండు భాగాలుగా ప్లాన్ రానుంది.
దీంతో.. రౌడీ పాన్ ఇండియా ఆశలు ఇంకా ఉన్నాయని ప్రూవ్ చేస్తున్నాడు. ఏదేమైనా మొన్న హిందీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానితో చర్చించి హిందీ సినిమా ఓకే చేయించుకునే పని చేసిన రామ్ చరణ్‌లానే, విజయ్ కూడా అడుగు ముందుకేశాడు. లెక్క మార్చాడు. పుష్ప కంటే ముందే బాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా ప్లాన్ చేసిన బన్నీ.. ఇంకా అటువైపు అడుగులు పూర్తిగా వేయలేదు. ఇంతలోనే రామ్ చరణ్ వెళుతున్న బాటలో నడిచి దూసుకెళుతున్నాడు విజయ్ దేవరకొండ.