Rashmika, Vijay : రష్మికతో విజయ్ దేవరకొండ..! సంక్రాంతి నుంచి ఫ్యామిలీ స్టార్ ఔట్..

డియర్ కామ్రేడ్ నుంచి వరుస ఫ్లాపులు పడుతున్న రెట్టింపు ఎనర్జీ తో మళ్లీ తన ప్రయత్నాన్ని చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ మూవీ ఇచ్చిన ఝలక్ నుంచి ఎలాగోలా కోలుకున్న రౌడీ హీరో మెల్లగా తిరిగి ఖుషి మూవీతో సో సో టాక్ ను సొంతం చేసుకున్నాడు. అయితే కమర్షియల్ హిట్ కోసం ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్న రౌడీ హీరో.. ఫ్యామిలీ స్టార్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరుశురాశంతో జతకట్టడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

kantara: ఈసారి అంతకు మించి.. కాంతార ఛాప్టర్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్..

ఫ్యామిలీ స్టార్ మూవీని మొదట పొంగల్ రేస్ లో పెట్టాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అయితే అనూహ్యంగా ఈ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు టాక్. ఇటీవల ఓ షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లాల్సిన మూవీ యూనిట్ కి వీసా సమస్యలు ఎదురవడంతో షూటింగ్ ఆలస్యం అయింది. దానికి తోడు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండడంతో మేకర్స్ సినిమాను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. రేసులో గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్, హనుమాన్,ఈగల్ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పోటీలో ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నా వర్క్ కంప్లీట్ అవ్వలేని పరిస్దతి. దీంతో పొంగల్ రిలీజ్ కరెక్ట్ కాదని భావించిన మేకర్స్ వాయిదా వేసినట్లు వచ్చారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న ఫ్యామిలీ స్టార్.. జనవరి ఎండింగ్ లేదా మార్చి కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.. మరోపక్క మూవీ లో రష్మిక మందన్న క్యామియో రోల్ చేస్తుందని ప్రచారం నడుస్తోంది. విజయ్, పరుశురాంతో ఉన్న అనుబంధంతో మూవీకి ఓకే చేసినట్లు తెలుస్తోంది. దీంతో సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ జోడీగా క్రేజ్‌ సంపాదించిన విజయ్‌, రష్మిక కాంబో.. ఈ సినిమాలో మరోసారి మెరువబోతున్నారని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్‌, ఫ్యాన్స్‌. మరి దీనిపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో చూడాలంటున్నారు.