Kushi OTT: ఖుషి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ అంటే..?

ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొంది. ఈ నెల 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 08:42 PM IST

Kushi OTT: ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అబ్దుల్ వహద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘ఖుషి’ తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొంది.

ఈ నెల 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. యూఎస్‌లో మాత్రం ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. యూఎస్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. సమంత అమెరికాలో ఈ చిత్ర ప్రమోషన్స్ చేయడం కూడా కలిసొచ్చింది. తెలుగులో మొత్తంగా రూ.70 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినప్పటికీ.. స్వల్ప నష్టాల్ని చవిచూసింది. ఈ చిత్రాన్ని యువ, కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. ఈ చిత్రం గతంలో వచ్చిన సఖి వంటి పలు చిత్రాల కలగూరగంపలాగా ఉందనే టాక్ రావడం వసూళ్లపై ప్రభావం చూపింది.

మొదట్లో మంచి టాకే వినిపించినప్పటికీ, తర్వాత ఎందుకో ప్రేక్షకుల నుంచి సరైన స్పందన మాత్రం దక్కలేదు. అయితే, విజయ్, సమంతకు గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం ఊరటనిచ్చిందనే చెప్పాలి. థియేటర్లో పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.