Vijay Sethupathi: రామ్ చరణ్‌కు హ్యాండిచ్చిన కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి

జవాన్, విక్రమ్, ఉప్పెన సినిమాల్లో విలన్‌గా కనిపించిన విజయ్ సేతుపతి విలన్ రోల్స్ వేయనంటున్నాడట. అలాగని కేవలం హీరోగానే ఉండాటా.. అంటే.. అదేంలేదు ఏ పాత్ర అయిన వేస్తాను కాని, విలనీ రోల్స్ మాత్రం వేయననేశాడట.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 06:50 PM IST

Vijay Sethupathi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో లివింగ్ లెజెండ్ శంకర్ తీస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇది మార్చ్ ఫస్ట్ వీక్‌లోగా పూర్తవుతుందట. ఆ తర్వాత మార్చ్ ఎండ్ నుంచి ఉప్పెన ఫేం బుచ్చి బాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ చేయబోతున్న సినిమా మొదలవుతుంది. ఆల్రెడీ ఆస్కార్ అచీవర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకోసం రంగంలోకి దిగాడు. ఓ పాట కంపోజ్ కూడా చేశాడు. ఇక ప్రి ప్రొడక్షన్ పనులు మొదలై షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసే టైంలో ఇందులో విలన్‌గా నటించాల్సిన తమిళ స్టార్ విజయ్ సేతుపతి హ్యాండ్ ఇచ్చాడు.

DEVARA: రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తా అంటున్న తారక్..

ఆల్రెడీ ఉప్పెనలో తను విలన్‌గా నటించాడు. అలా బుచ్చిబాబుతో స్నేహం కూడా ఉంది. దీనికి తోడు తన రెమ్యునరేషన్‌ని 22 కోట్ల నుంచి ఏకంగా రూ.30 కోట్లకు పెంచాడు. జవాన్ హిట్ అవటం వల్లే తన పారితోషికానికి రెక్కలొచ్చాయన్నారు. అయినా సరే అని బుచ్చిబాబు టీం నిర్మాతని ఒప్పించింది. ఇంతా చేస్తే ఇప్పడు ఈ హీరో విలన్‌గా చేయనంటున్నాడు. జవాన్, విక్రమ్, ఉప్పెన సినిమాల్లో విలన్‌గా కనిపించిన విజయ్ సేతుపతి విలన్ రోల్స్ వేయనంటున్నాడట. అలాగని కేవలం హీరోగానే ఉండాటా.. అంటే.. అదేంలేదు ఏ పాత్ర అయిన వేస్తాను కాని, విలనీ రోల్స్ మాత్రం వేయననేశాడట.

అంతే.. బుచ్చిబాబు, రామ్ చరణ్ మూవీలో విజయ్ వేయాల్సింది విలన్ రోలే అవటంతో ఆ సినిమా నుంచి తప్పుకొన్నాడట. ఇప్పడు విజయ్ సేతుపతి నో విలనిజం అనేసరికి, పాత్రని రీడిజైన్ చేయటమో, మరో నటుడిని విలన్‌గా తీసుకోవాటమో చేయాల్సి వస్తోందట.