ఈ నెల 9న విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా పూర్తి సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. రీసెంట్‌గానే మనాలిలో యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. లైగర్ లాంటి ఫ్లాప్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఖుషీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విజయ్. రౌడీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. విజయ్ బర్త్ డే రోజున సాంగ్‌తో పాటు మరో అప్డేట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. దీంతో ఆరోజు ట్రైలర్ రిలీజ్ చేసే చాన్స్ ఉందంటూ టాక్ నడుస్తోంది.
ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ఫస్ట్ లుక్, టైటిల్, గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజైన సాంగ్ ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ హెషమ్ అబ్దుల్ ట్యూనింగ్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమా స్టోరీ ఎలా ఉన్నా మ్యూజికల్ హిట్ మాత్రం పక్కా అంటున్నారు. అటు మూవీ స్టోరీ గురించి కూడా చాలా గాసిప్స్ వస్తున్నాయి. వాటి గురించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఏదీ లేకున్నా మంచి లవ్ స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.