Vimanam Review: విమానం సినిమా రివ్యూ.. సముద్రఖని మెప్పించాడా?

తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనే ఈ సినిమాకు ప్రాణం. యాక్టింగ్‌ విషయంలో ప్రతీ ఒక్కరూ ఇరగదీశారు. ముఖ్యంగా సముద్రఖని తన పాత్రలో జీవించేశాడు.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 10:03 AM IST

Vimanam Review: డైరెక్టర్‌ సముద్రఖని మెయిన్‌లీడ్‌గా తెలుగు, తమిళంలో వచ్చిన విమానం సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివప్రసాద్‌ యానాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, ధన్‌రాజ్‌, మీరా జాస్మిన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇది 2008లో హైదరాబాద్‌లో జరిగే తండ్రీ కొడుకుల కథ. తండ్రి వీరయ్య ఓ దివ్యాంగుడు. భార్య చాలా క్రితం చనిపోతుంది. కొడుకు రాజుతో ఓ బస్తీలో ఉంటాడు వీరయ్య. వారసత్వంగా వచ్చిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ నడుపుతూ కొడుకును చదివిస్తుంటాడు. రాజుకు విమానం అంటే పిచ్చి. విమానం కనిపిస్తే అన్నీ మర్చిపోతాడు. దాన్ని చూసేందుకు రోజూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంటాడు. తనని విమానం ఎక్కించమని రోజూ తండ్రిని అడుగుతుంటాడు. బాగా చదువుకుంటే పెద్దాయ్యక నువ్వే విమానం ఎక్కుతావని చెబుతుంటాడు వీరయ్య.

అనుకోకుండా ఓ రోజు రాజు కళ్లు తిరిగి కిందపడిపోతాడు, ఆసుపత్రికి తీసుకెల్తే రాజుకు బ్లడ్‌ క్యాన్స్‌ ఉందని డాక్టర్లు చెప్తారు. దీంతో కొడుకు కోరికని నెరవేర్చాలని, విమానం ఎక్కించాలని నిర్ణయించుకుంటాడు వీరయ్య. కానీ డబ్బు లేదు. అందుకోసం వీరయ్య ఏం చేశాడు? కొడుకుని విమానం ఎక్కించాడా? కొడుకు కోరిక తీర్చేందుకు వీరయ్య ఎలాంటి బాధలు పడ్డాడు? మిగతా క్యారెక్టర్స్‌ వీరయ్యకు ఎలా సహాయం చేశారు అనేది కథ. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనే ఈ సినిమాకు ప్రాణం. యాక్టింగ్‌ విషయంలో ప్రతీ ఒక్కరూ ఇరగదీశారు. ముఖ్యంగా సముద్రఖని తన పాత్రలో జీవించేశాడు. ఫస్ట్‌ హాప్‌ మొత్తం క్యారెక్టర్లను పరిచయం చేయడం, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ప్రేమను చూపించడంలోనే ముగిసిపోయింది. ఇక సెకండాఫ్‌ మొత్తం ఎమోషనల్‌గా మారిపోయింది.

క్లైమాక్స్‌లో ఎమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లారు. హార్ట్ టచ్చింగ్‌గా మార్చారు. క్లైమాక్స్‌లో వచ్చే అతిపెద్ద ట్విస్ట్ గుండెల్ని బరువెక్కిస్తుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో కథని స్పీడప్‌ చేసి, ప్రీ క్లైమాక్స్ వరకు కాస్త ప్రయారిటీ ఇస్తే మరింత బాగుండేది. దీనికితోడు క్లైమాక్స్ ఏంటనేది ముందే ఊహించినట్టుగా లీడ్‌ తీసుకోవడం సినిమాకి పెద్ద డ్రా బ్యాక్‌. ఇంటర్వెల్‌ వచ్చేసరికి ఆడియెన్స్‌కి క్లైమాక్స్ అర్థమయ్యేలా ఉండటం మైనస్‌గా మారింది. ఈ సినిమాకు మ్యూజిక్‌ చాలా పెద్ద అస్సెట్‌. ప్రతీ ఎమోషనల్‌ సీన్‌కు మ్యూజిక్‌ ప్రాణం పోసింది. ఆడియన్స్‌ను ఇన్వాల్వ్‌ అయ్యేలా చేసింది. ఓవరాల్‌గా బ్లాక్‌బస్టర్‌ అని చెప్పకపోయినా “విమానం” ఓ మంచి ఫీల్‌ గుడ్‌ సినిమా అని చెప్పొచ్చు.