కథలో అనుకోకుండా ఆ ఊరికి ఓ ప్రాబ్లమ్ వస్తుంది. వరుసగా అంతా చనిపోతుంటారు. అయితే ఆ ప్రమాదం నుంచి రుద్రవణాన్ని కాపాడే వ్యక్తి కేవలం హీరో మాత్రమే. అసలు ఆ ఊరికి వచ్చిన ప్రమాదమేంటి ? ఆ ప్రమాదం నుంచి హీరో వాళ్లను ఎలా కాపాడతాడు ? అసలు హీరోకి ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి ? అనేది స్టోరీ లైన్. స్టోరీ మొత్తం దాదాపు రివీల్ చేసినా.. ట్రైలర్ మాత్రం అద్భుతంగా కట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది ట్రైలర్.
ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తుండటం మరో హైలెట్. ఇక సినిమాలో గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. కథకు తగ్గట్టు సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని వేరే ప్రపంచానికి తీసుకువెళ్లే విధంగా చాలా నేచురల్‌గా సీన్స్ ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య లవ్‌ట్రాక్ కూడా బాగా ప్లాన్ చేశాడు డైరెక్టర్. వాళ్ల మధ్య లవ్‌ను చూపిస్తూనే థ్రిల్లర్ జోనర్‌లోకి కథను మార్చి ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. హీరోయన్ సంయుక్త మీనన్‌ను రోల్ చుట్టే కథ మొత్తం తిరిగినట్టు తెలుస్తుంది.
హీరోయిన్‌ను కేవలం గ్లామర్ కోసం కాకుండా సినిమాలో ఆమె రోల్ చాలా కీలకంగా ఉండేలా ప్లాన్ చేశాడు డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ దిమ్మతిరిగే మ్యూజిక్ అందించాడు. ట్రైలర్‌లో ప్రతీ ఎమోషన్‌కు బీజీఎం ప్రాణం పోసింది. సునీల్, బ్రాహ్మీజీ, అజయ్ లాంటి సీనియర్ యాక్టర్స్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఒకే కథలో లవ్, త్రిల్లర్ సినిమాను చూపించబోతున్నాడు కార్తీక్ దండు. దానికి తోడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత తీస్తున్న ఫస్ట్ సినిమా కావడం, అది కూడా ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్‌కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌తో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ నెల 21న ఆడియన్స్ ముందుకు రానున్ని ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.