VISHAL: పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విశాల్ వీడియో ఒకటి రీసెంట్‌గా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. న్యూయార్క్‌లో ఓ అమ్మాయితో విశాల్ వెళ్తున్న టైంలో కొందరు వ్యక్తులు వీడియో తీశారు. వాళ్లు వీడియో తీసున్న విషయం తెలిగానే విశాల్ తన టీషర్ట్‌తో మొహం కవర్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటర్నెట్‌లో ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.
Ram Charan: తనే నా బలం.. చరణ్ ప్రేమ కోసం అలాంటి త్యాగం..!
విశాల్ ఫారిన్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నాడంటూ ఏవోవో ఊహాగానాలు వచ్చాయి. ఎవరికి నచ్చన స్టోరీ వాళ్లు రాసుకున్నారు. ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకున్నారు. సింపుల్‌గా ఈ ఇన్సిడెంట్‌పై ఇంటర్నెట్‌లో పంచాయితీ పెట్టారు. దీంతో ఈ వీడియో గురించి స్వయంగా క్లారిటీ ఇచ్చాడు హీరో విశాల్. అసలేం జరిగిందో చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘అందరూ నన్ను క్షమించండి. ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పే సమయం వచ్చింది. అందులో కొంచెం వాస్తవం.. కొంచెం ప్రాంక్ ఉంది. లొకేషన్ ప్రకారం అది న్యూయార్క్‌లో తీసిందే. నేను, మా కజిన్స్ తరచుగా అక్కడకు వెళ్లి సరదాగా గడుపుతుంటాం. మా ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఏడాదంతా పడిన కష్టాన్ని మర్చిపోవడానికి.. న్యూయార్క్‌కు వెళ్తాం.
ఆ వీడియోలో నేను మొహం ఎందుకు దాచుకున్నానంటే.. అదొక ప్రాంక్. క్రిస్మస్ రోజు నాతో సరదాగా మా కజిన్స్ అందరూ ప్రాంక్ వీడియో చేశారు. నన్ను ఆటపట్టించడం కోసం చేశారంతే. అలా చేయాలని నాతో చెప్పి వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికైనా దానిపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని ఆశిస్తున్నా. కొంతమంది ఆ వీడియో చూసి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ నేను ఎవరినీ ద్వేషించాలని అనుకోవడం లేదు’’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వీడియో విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.