VishwakSen: ఎన్టీఆర్, విజయ్ దారిలో నడుస్తున్న విశ్వక్‌సేన్

గతంతో విజయ్‌లానే బోల్డ్‌గా మాట్లాడి తన సినిమాలను ప్రమోట్ చేసుకున్నాడు విశ్వక్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని కూడా రౌడీ స్టైల్లో ప్రమోట్ చేయటంతో ఎన్టీఆర్ పేరు సీన్‌లోకి వస్తోంది. విజయ్ ప్రమోషన్ స్టైల్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు సీన్‌లోకి రావటానికి లింకుంది.

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 05:47 PM IST

VishwakSen: విశ్వక్‌సేన్ ఏం చేసినా సెన్సేషనే. అది మొన్నటి వరకు ఓకే. కాని, తన ప్రతీ అడుగులో విజయ్ దేవరకొండ కనిపించటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గతంతో విజయ్‌లానే బోల్డ్‌గా మాట్లాడి తన సినిమాలను ప్రమోట్ చేసుకున్నాడు విశ్వక్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని కూడా రౌడీ స్టైల్లో ప్రమోట్ చేయటంతో ఎన్టీఆర్ పేరు సీన్‌లోకి వస్తోంది. విజయ్ ప్రమోషన్ స్టైల్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు సీన్‌లోకి రావటానికి లింకుంది.

ఏంటేంటే విశ్వక్ తన సినిమాల ప్రమోషన్ కోసం రౌడీ స్టార్‌ని కాపీ కొడుతున్నాడు. సినిమాల్లో పెర్ఫామెన్స్ విషయానికొస్తే ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని కాపీకొడుతున్నాడని అంటారు. ఈ కామెంట్ కొత్తది కాదు. కాని కొత్తగా హైలెట్ అవటానికి రీజన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సాంగ్‌లో స్టెప్‌ని స్టేజ్ మీద వేసి, సినిమాకు హైప్ తెచ్చిన విధానం ఖుషీ మూవీ ప్రమోషన్ లానే ఉంది. దీంతో ఇంకా విజయ్‌ని విశ్వక్ ఈ విషయంలో వదల్లేదనే మాటలు మొదలయ్యాయి. అంతేకాదు అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ నటన, కొన్ని సీన్లలో టెంపర్ మూవీలో తారక్ ఎక్స్‌ప్రెషన్‌ని పోలి ఉందని అప్పట్లో అన్నారు. తారక్ అబిమానిగా అలా ఎన్టీఆర్‌ని కాపీ కొట్టాడనే మాటలు వినిపించాయి. ఏదేమైనా ప్రమోషన్‌కి విజయ్ ఫార్ములా, పెర్పామెన్స్‌కి యంగ్ టైగర్ ఫార్ములాని వాడేస్తున్నాడు విశ్వక్ సేన్.