Vishwak Sen: హీరో విశ్వక్ సేన్‌కు గాయాలు.. తూచ్.. అదంతా ఉత్తిదే..!

విశ్వక్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీంతో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 05:13 PM IST

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ గాయపడ్డారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. విశ్వక్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీంతో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ స్టంట్ కోసం విశ్వక్ రిహార్సల్స్ చేస్తుండగా.. గాయపడ్డారని సమాచారం. తోటి నటులు, ఫైటర్స్‌తో కలిసి లారీ మీద స్టంట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. స్లిప్ అయ్యి కింద పడ్డారట.

Harish Shankar : ఆగిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్.. రవితేజ తో హరీష్.. పీరియాడికల్ డ్రామా

దీంతో ఒక్కసారిగా షాకైన మూవీ యూనిట్.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఇది ఇప్పుడు జరిగింది కాదట. కొన్ని రోజుల క్రితమే జరగగా.. ప్రస్తుతం అంతా సెట్ అయిందని తెలుస్తోంది. కాబట్టి.. మాస్ కా దాస్ ఫ్యాన్స్‌కు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. చివరగా దాస్‌ కా ధమ్కీ సినిమాతో మంచి హిట్ కొట్టిన విశ్వక్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతోను మాసివ్ హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ తెస్తున్నాయి. ఈ సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో గామి అనే సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.