Viswaksen – NTR: ఎన్టీఆర్‌కు కొత్త బిరుదు ఇచ్చిన విశ్వక్‌సేన్‌

విశ్వక్‌ అభిమానానికి తారక్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. నిజానికి ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ అని పిలుస్తుంటారు. అటు చరణ్‌ ఫ్యాన్స్‌ కూడా ఆయనను అదే పేరుతో పిలుస్తారు.

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 12:30 PM IST

తెలుగు ఆడియన్స్‌లో మంచి మాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న యంగ్‌ హీరోస్‌లో విశ్వక్‌సేన్‌ ఒకరు. ఫలక్‌నామా దాస్‌ తరువాత ఓన్‌ డైరెక్షన్‌లో దాస్‌ కా ధమ్కీ అనే మరో సినిమా తీశాడు విశ్వక్‌. తన తండ్రి కరాటేరాజు ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను ఈ నెల 22న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ నెల 17న శిల్పకళావేదికలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు యంగ టైగర్‌ ఎన్టీఆర్‌ చీఫ్‌గెస్ట్‌గా రానున్నాడు. తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానికి అన్న విషయం చాలా ఫంక్షన్స్‌లో ఓపెన్‌గా చెప్పేశాడు విశ్వక్‌. దీంతో దాస్‌ కా ధమ్కీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ రావడంలో పెద్ద విశేషమేమీ లేదు.. కానీ ఈవెంట్‌ కోసం విశ్వక్‌ రెడీ చేసిన ఇన్విటేషన్‌ పోస్టర్‌ ఇప్పుడు అందరి అటెన్షన్‌ను గ్రాబ్‌ చేస్తోంది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్‌ పేరు ‘పక్కన మాస్‌ అమ్మ మొగుడు ఎన్టీఆర్‌’ అని రాయించాడు. దీంతో విశ్వక్‌ అభిమానానికి తారక్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. నిజానికి ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ అని పిలుస్తుంటారు. అటు చరణ్‌ ఫ్యాన్స్‌ కూడా ఆయనను అదే పేరుతో పిలుస్తారు. ఈ విషయంలో చెర్రీ, తారక్‌ ఫ్యాన్స్‌కు ఇంటర్నెట్‌లో చిన్నపాటి వార్‌ కూడా జరుగుతోంది. దీంతో.. ఈ గొడవ నాకెందుకు వచ్చిందిలే అనుకున్నాడు కావచ్చు.. ఏకంగా కొత్త బిరుదు ఇచ్చేశాడు విశ్వక్‌. అటు ఫ్యాన్స్‌కు కూడా ఈ బిరుదు ఎంతగానో నచ్చింది. దీంతో విశ్వక్‌ను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. విశ్వక్‌సేన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.