విశ్వంభర టీజర్ రివ్యూ, అంజి తర్వాత చిరూ రిస్క్

మెగాస్టార్ చిరంజీవి అనగానే ప్రయోగాత్మక చిత్రాలు కళ్ళ ముందు ఉంటాయి. తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందించేందుకు ప్రయత్నించే మెగాస్టార్... వయసు మీద పడుతున్నా కూడా వెనకడుగు వేయడం లేదు.

  • Written By:
  • Publish Date - October 13, 2024 / 10:14 AM IST

మెగాస్టార్ చిరంజీవి అనగానే ప్రయోగాత్మక చిత్రాలు కళ్ళ ముందు ఉంటాయి. తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందించేందుకు ప్రయత్నించే మెగాస్టార్… వయసు మీద పడుతున్నా కూడా వెనకడుగు వేయడం లేదు. ఆచార్య సినిమా షాక్ నుంచి బయటకు వచ్చిన చిరంజీవి ఇప్పుడు విశ్వంభర సినిమాపై చాలా సీరియస్ గా ఫోకస్ చేసారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఉండటంతో కాస్త ఆలస్యం అవుతోంది.

వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇంకా సినిమా షూటింగ్ లో ఒక పాట బ్యాలెన్స్ ఉండటంతో కాస్త ఆలస్యం అయ్యేలా కనపడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ గా ‘విశ్వంభర’ వస్తోంది. సినిమా ప్రకటనతోనే జనాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. తాజాగా సినిమా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెంచింది అనే చెప్పాలి.

‘When Myths Collide Legends Rise’ అనే కోట్‌ తో పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాయిపై కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశలం పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక చిరంజీవి లుక్… కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, అలాగే ఉరుములు మెరపులతో కూడిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఇక టీజర్ లో డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. టీజర్ ఓపెనింగ్ షాట్ లో డైనోసార్ లు, వాటర్ ఫాల్స్ వంటివి అదిరిపోయాయి.

“ఇక విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్ర వీగుతున్న ఈ అరాచాకానికి ముగింపు పలికే మహా యుద్దాన్ని తీసుకొస్తుంది “ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ఈ టీజర్ లో చూపించారు. ఇక టీజర్ లో చిరంజీవి ఎంట్రీ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఓ గ్లేషియర్ పక్కన చిరంజీవి యాక్షన్ సీన్ టీజర్ కె హైలెట్ గా నిలిచింది. లాస్ట్ లో ఆంజనేయుడి ముందు చిరంజీవి నిలబడ్డ లుక్ ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సినిమా కోసం దాదాపు 2 ఏళ్ళ టైం తీసుకోవడంతో ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.